INDvsWI: ఈ ముగ్గురూ అట్టర్ ఫ్లాప్.. రెండో టీ20లో అవకాశం దక్కుతుందా?
వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లలో తిలక్ వర్మ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు కూడా తేలిపోవడం జట్టును దెబ్బతీసింది. ఇలా ఈ మ్యాచులో విఫలమైన ముగ్గురు కీలక ఆటగాళ్లు ఎవరో చూస్తే..
శుభ్‌మన్ గిల్
టీమిండియా ఓపెనర్‌గా తన స్థానం పదిలం చేసుకున్న యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అతను రాణించాడు. దీంతో తొలి టీ20లో గిల్‌పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో అతను చాలా దారుణంగా ఫెయిలయ్యాడు. కేవలం మూడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
ముఖ్యంగా తను చివరగా ఆడిన టీ20 మ్యాచులో గిల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో అతనిపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ గిల మాత్రం చాలా చెత్తగా ఆడి పెవిలియన్ చేరడం అందరినీ నిరుత్సాహపరిచింది.

ఇషాన్ కిషన్
విండీస్‌తో వన్డే సిరీసులో వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో కిషన్ ఆకట్టుకున్నాడు. దీంతో టీ20 సిరీసులో కూడా అతను రాణిస్తాడని అంతా ఆశించారు. కానీ తొలి టీ20లో కిషన్ క్రీజులో చాలా ఇబ్బందిగా కనిపించాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న అతను కేవలం ఆరు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫున పలు టీ20లు ఆడిన కిషన్.. ఈ ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. తన చివరి 15 టీ20 ఇన్నింగ్సుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీన్నిబట్టి చూస్తే.. కిషన్‌ను పొట్టి ఫార్మాట్‌లో పక్కన పెట్టడమే మంచిదని అనిపిస్తోంది.
అక్షర్ పటేల్
గతేడాది నుంచి మంచి ఫామ్‌లో కనిపించిన అక్షర్ పటేల్‌కు ఇటీవలి కాలంలో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నిలకడగా రాణించిన ఏకైక బ్యాటర్ అక్షర్ పటేల్ మాత్రమే కావడం గమనార్హం.

అయితే జడేజా రీఎంట్రీ తర్వాత టీమిండియాలో అతనికి అవకాశాలు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో ఛాన్స్ దక్కడంతో అతను రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఒత్తిడిని తట్టుకోలేక పోయిన అక్షర్ తేలిపోయాడు. బౌలింగ్‌లో కూడా పటేల్ పెద్దగా రాణంచకపోవడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications