Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : జిమ్‌లో తెగ శ్రమిస్తున్న విరాట్ కోహ్లీ.. ఫొటోలు వైరల్!

ప్రపంచ క్రికెట్‌లో ఫిట్‌నెస్‌పై బాగా ఫోకస్ పెట్టే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే. ఈ టీమిండియా స్టార్ సుమారు ఏడెనిమిదేళ్లుగా అలాగే ఉన్నాడు. వయసు పెరిగింది, గడ్డం కొంత తెల్లబడిందేకానీ.. ఫిట్‌నెస్ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్ కోసం కరీబియన్ దీవులకు చేరుకున్న అతను.. అక్కడ కూడా తన డైలీ వర్కవుట్‌లు చేస్తూనే ఉన్నాడు.

దీనికిి సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్నాడు కోహ్లీ. జిమ్‌లో తన 'లెగ్ డే' గురించి పోస్టు పెట్టాడు. 'ప్రతిరోజూ లెగ్ డే అవ్వాలి. 8 ఏళ్ల నుంచి ఇదే చేస్తున్నా' అంటూ ఈ ఫొటోలను పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో కోహ్లీ తన కాళ్లకు ఎక్సర్‌సైజులు చేస్తున్నాడు. క్రికెటర్లక కాళ్ల బలం ఎంత ముఖ్యమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటర్లయినా, బౌలర్లయినా వాళ్ల కాళ్లు బలంగా ఉంటేనే ఎక్కువ కాలం ఆడగలుగుతారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

INDvsWI Virat Kohli shares his gym workout photos on instagram

కోహ్లీ వర్క్ ఎథిక్స్ ఎవరికీ లేవని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో అందుకే కోహ్లీని కింగ్ అంటారని చెప్తున్నారు. ఇంకొందరు ఫ్యాన్స్ అయితే కోహ్లీని మెచ్చుకుంటూ ఇలా నిలకడగా ఎక్సర్‌సైజులు చేస్తూ ఉంటేనే అలాంటి బాడీ వస్తుందని అంటున్నారు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ రెడీ అవుతున్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రాంలో కంపారిజన్ మీద ఒక క్రిప్టిక్ పోస్టును కోహ్లీ పంచుకున్నాడు. మనం మనలా ఉండాలనే మెసేజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, విండీస్‌తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా సభ్యులంతా ఇప్పటికీ వెస్టిండీస్ చేరుకున్నారు. అక్కడ ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో కోహ్లీ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

Story first published: Sunday, July 9, 2023, 17:12 [IST]
Other articles published on Jul 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+