Virat Kohli : కుర్ర బ్యాటర్‌కు కీలక సలహాలిస్తున్న కోహ్లీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!
ఇటీవలి కాలంలో బ్యాటుతో అద్భుతంగా రాణించి టీమిండియాలో చోటు దక్కించుకున్న కుర్రాళ్లలో యశస్వి జైస్వాల్ ఒకడు. దేశవాళీల్లో తమ టీం విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతను.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా చెలరేగాడు. దీంతో అతనికి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన బృందంలో బ్యాకప్ ప్లేయర్‌గా అవకాశం వచ్చింది. కానీ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు.
ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్ సెషన్స్‌లో అతని ప్రదర్శన, ప్రస్తుతం ఉన్న ఫామ్ వల్ల అతన్ని వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టులకు కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. విండీస్ టూర్‌లో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ ఈ నెల 12న డొమినికాలో మొదలవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం టీమిండియా సభ్యులంతా కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైస్వాల్ ఆటతీరును గమనించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కొన్ని కీలక సూచనలు చేశాడు. ఇలా కోహ్లీ నుంచి బ్యాటింగ్ పాఠాలు నేర్చుకుంటున్న జైస్వాల్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జైస్వాల్ బ్యాటింగ్‌కు ఎలా మెరుగులు దిద్దుకోవాలో కోహ్లీ సలహాలు ఇస్తూ కనిపించాడు.
ఈ వీడియోలో జైస్వాల్‌కు కోహ్లీ సలహాలు ఇస్తుంటే.. అటు పక్క నుంచి యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కూడా ఈ సూచనలు వింటూ కనిపించాడు. ప్రస్తుతం జట్టులో పుజారా స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానంలో జైస్వాల్ లేదా రుతురాజ్ గైక్వాడ్ ఆడాలి. అయితే ఎడం చేతి వాటం బ్యాటర్ కావడం వల్ల జైస్వాల్‌కు ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కోహ్లీ సలహాలు అతని బ్యాటింగ్‌కు ఎంతగా ఉపయోగపడ్డాయో తెలియాలంటే మ్యాచులు మొదలయ్యే వరకు ఆగాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications