Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కోహ్లీని కౌగిలించుకొని ఆనందంతో ఏడ్చేసిన విండీస్ ప్లేయర్ తల్లి.. వీడియో వైరల్!

వెస్టిండీస్‌తో టెస్టు సిరీసులో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. తొలి టెస్టులో అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతను.. రెండో టెస్టులో సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో సుమారు ఐదేళ్లుగా విదేశాల్లో కోహ్లీ సెంచరీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను కూడా ఖుషీ చేశాడు. అంతేకాదు, విండీస్ టీంలో తన ఫ్యాన్ అయిన వికెట్ కీపర్ జోషువా డ సిల్వను కూడా చాలా సంతోష పెట్టాడు కింగ్.

కింగ్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. విండీస్ వికెట్ కీపర్ డసిల్వ కూడా కోహ్లీకి పెద్ద ఫ్యాన్. రెండో టెస్టులో కోహ్లీ డబుల్స్ తీస్తున్నప్పుడు కూడా.. '2012 నుంచి ఇలా డబుల్స్ దొంగిలిస్తూనే ఉన్నావ్' అంటూ డసిల్వ కామెంట్ చేశాడు. అతను అలా అనడంతో కోహ్లీ కూడా నవ్వేశాడు. వీళ్లిద్దరి మధ్య ఈ మ్యాచ్‌లో చాలా ఫ్రెండ్లీ కన్వర్జేషన్స్ జరిగాయి.

West Indies wicketkeeper Joshua da Silva is a big fan of Virat Kohli.

ఈ క్రమంలో కోహ్లీ కూడా నవ్వేస్తూ.. 'నీకు నా మైల్‌స్టోన్స్‌పై మరీ ఎక్కువ ఫోకస్ ఉంది' అంటూ జోక్ చేశాడు. కేవలం డసిల్వనే కాదు. వాళ్ల అమ్మ కూడా కోహ్లీకి పెద్ద ఫ్యాన్. ఆమెను కలుస్తానని కోహ్లీ మాటిచ్చాడు కూడా. అందుకే రెండో టెస్టు మధ్యలో ఆమెను కలిశాడు. టీం బస్ ఎక్కేముందు ఆమెను కలిసిన కోహ్లీ.. కౌగిలించుకొని నవ్వుతూ మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

'ఎట్టకేలకు డసిల్వ వాళ్ల అమ్మ కోహ్లీని కలిశారు' అంటూ ఈ వీడియోను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. కోహ్లీ అంటే ఆమెకు తెగ ఇష్టమట. అతని ఆటకు ఆమె డైహార్డ్ ఫ్యాన్. కోహ్లీని కలిసినప్పుడు ఆమె మొఖంలో సంతోషం చూస్తేనే.. తను ఈ మోడ్రన్ గ్రేట్‌కు ఎంత పెద్ద ఫ్యానో తెలిసిపోతుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Story first published: Saturday, July 22, 2023, 12:06 [IST]
Other articles published on Jul 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+