వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లీ నిలబెట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (80), యశస్వి జైస్వాల్ (57) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అయితే కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న రోహిత్.. శతకం పూర్తి చేసుకోకుండానే పెవిలియన్ చేరాడు.
అంతకుముందే హోల్డర్ బౌలింగ్‌లో లూజ్ షాట్ ఆడిన జైస్వాల్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే వారికన్ వేసిన చూడచక్కని బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సెంచరీ మిస్ అవడంతో రోహిత్ చాలా చిరాకు పడినట్లు కనిపించాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ (10) వరుసగా రెండో టెస్టులోనూ చేతులెత్తేశాడు. ప్రతి బంతికీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. కీమర్ రోచ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే (8) కూడా మరోసారి నిరాశ పరిచాడు. షానన్ గాబ్రియెల్ వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడీ వెటరన్ బ్యాటర్. దీంతో భారత జట్టు 182/4తో కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ (87 నాటౌట్), రవీంద్ర జడేజా (36 నాటౌట్) ఈ జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన వీళ్లు.. అడపా దడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో సెంచరీకి చేరువైన కోహ్లీ.. తొందర పడకుండా జాగ్రత్తగా ఆడాడు. దీంతో రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 288/4 స్కోరుతో నిలిచింది. ఐదో వికెట్‌కు కోహ్లీ, జడేజా 100పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, గాబ్రియెల్, కీమర్ రోచ్, వారికన్ తలో వికెట్ తీసుకున్నారు.