Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : అరుదైన మైలురాయికి అడుగు దూరంలో కోహ్లీ.. ద్రావిడ్ ఏమన్నాడంటే?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టు అతని కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ క్రమంలోనే భారత్ తరఫున 500 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించేందుకు కోహ్లీ అడుగు దూరంలో ఉన్నాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రావిడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

2008లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. 500 పైగా మ్యాచుల్లో 50పైగా సగటుతో ఆడిన ఏకైక ప్లేయర్‌. ఈ రికార్డు భవిష్యత్తులో బద్దలవడం కూడా కష్టమే అని చెప్పాలి. అయితే గత కొన్నేళ్లుగా ఫామ్ లేక తంటాలు పడిన కోహ్లీ.. మళ్లీ నెమ్మదిగా ఫామ్ అందుకుంటున్నాడు. కానీ టెస్టుల్లో కోహ్లీ ఇంకా తన బెస్ట్ ఫామ్ అందుకోలేదనే చెప్పాలి. ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అవుతున్నారు.

Virat Kohli Rahul Dravid

ఇంతకుముందు సరదాకు సెంచరీలు బాదే కోహ్లీ.. ఇప్పుడు ముఖ్యంగా టెస్టుల్లో సెంచరీలు చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. అయితే ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం కేవలం అతని గణాంకాలను కాకుండా కోహ్లీ ఎఫర్ట్, అతని ఇంపాక్ట్‌నే చూస్తానని చెప్పాడు. విండీస్‌తో రెండో టెస్టు కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్ అని కూడా తనకు ఇప్పటి వరకు తెలియదన్నాడీ మాజీ లెజెండ్.

'ఇదొ అద్భుతమైన క్షణం. ప్రస్తుతం టీమిండియాలోనే చాలా మందికి కోహ్లీ స్ఫూర్తి. భారత్‌లో కూడా ఎందరికో కోహ్లీ ఐడల్. అతని గణాంకాలే కోహ్లీ స్థాయిని చూపిస్తాయి. రికార్డుల్లో అన్నీ ఉంటాయి కదా. నా వరకైతే తన ఎఫర్ట్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరూ చూడకుండా, తెర వెనుక కోహ్లీ ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అతను 500 మ్యాచులు ఆడాడంటే అదే కారణం' అని ద్రావిడ్ చెప్పాడు.

ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ డెడికేషన్, తనను తాను కండక్ట్ చేసుకునే విధానం టీంలో చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అని ద్రావిడ్ తెలిపాడు. 'అది అంత ఈజీగా వచ్చేది కాదు. తెర వెనుక చాలా కష్టపడటం వల్లనే కోహ్లీకి అది సాధ్యమైంది. దీని కోసం అతను చాలా త్యాగాలు చేశాడు. అలా చేయడానికి ఇప్పటికీ కోహ్లీ సిద్ధమే. ఒక కోచ్‌గా చెప్తున్నా.. అది చాలా గొప్ప గుణం. ఎంతో మంది కుర్రాళ్లు అది చూసే స్ఫూర్తి పొందుతారు' అని అభిప్రాయపడ్డాడు.

'మనం ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. మనం ఉండే పద్ధతిని బట్టి, ప్రాక్టీస్, ఫిట్‌నెస్.. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆడేందుకు వస్తున్న ఎంతో మంది కుర్రాళ్లకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నాయి. వాళ్లు కూడా కోహ్లీలాగే చాలా కాలం ఆడాలని ఆశిస్తున్నా. ఇలా సుదీర్ఘ కాలం ఆడాలంటే అది చాలా కష్టపడితేనే సాధ్యం. దాంతోపాటు క్రమశిక్షణ, పరిస్థితికి తగ్గట్లు మారడం.. ఇవన్నీ కోహ్లీ చూపించాడు. ఇది మరింత కాలం కొనసాగాలని కోరుకుంటున్నా' అన్నాడు.

Story first published: Thursday, July 20, 2023, 16:32 [IST]
Other articles published on Jul 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+