Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli విండీస్ టెస్టులో ఫన్నీగా కోహ్లీ.. ఫ్యాన్స్‌కు నచ్చలా!

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగులతో విండీస్‌ను రోహిత్ సేన చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కెప్టెన్ రోహిత్ కూడా సూపర్ సెంచరీ చేశాడు. మరో సెంచరీ చేసేలా కనిపించిన విరాట్ కోహ్లీ మాత్రం ఆ మార్కు అందుకోలేకపోయాడు.

మూడ్రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 76 పరుగులకే పెవిలియన్ చేరాడు. అప్పటికే పలుమార్లు అతనికి జీవనదానాలు లభించినా వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. అయితే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఫీల్డింగ్ చేయడానికి వచ్చిన కోహ్లీ.. మంచి జోష్‌లో కనిపించాడు. మ్యాచ్ మధ్యలో డ్యాన్స్ చేస్తూ కనిపించిన కోహ్లీ.. ఆ తర్వాత తనవైపు వచ్చిన విండీస్ ప్లేయర్లను కూడా ఆటపట్టించాడు.

 Virat Kohli

ఇలా కోహ్లీ ఆటపట్టించడం చూసిన ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఇలాంటి వాటికి తక్కువేం లేదు కానీ.. సెంచరీలు చేయడం లేదంటూ కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సుమారు ఐదుసార్లు కోహ్లీకి జీవనదానం లభించింది. దీంతో అతను కచ్చితంగా 76వ అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఆ ఫీట్ సాధించలేకపోయాడు.

స్వదేశంలో కాకుండా విదేశీ గడ్డపై కోహ్లీ సెంచరీ చేసి ఐదేళ్లు దాటిపోయింది. చివరగా 2018లో ఆస్ట్రేలియాపై వాళ్ల దేశంలో సెంచరీ సాధించిన కోహ్లీ.. మళ్లీ విదేశీ గడ్డపై టెస్టు శతకం చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే విండీస్ పర్యటన ముగిసేలోపు అతను ఈ ఎదురు చూపులకు కూడా ఫుల్‌స్టాప్ పెడతాడా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి రెండో టెస్టులో అయినా కోహ్లీ ఈ ఫీట్ సాధించి, ఫ్యాన్స్‌ను సంతోష పెడతాడేమో చూడాలి.

Story first published: Sunday, July 16, 2023, 10:30 [IST]
Other articles published on Jul 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+