ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పాపులారిటీ ఉన్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మోడ్రన్ గ్రేట్‌గా చెప్పుకునే ఈ బ్యాటర్ స్థాయి వేరే. తనను అంత మంది ఎందుకు ప్రేమిస్తారో కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. విండీస్‌తో రెండో వన్డేలో అతను చేసిన పని చూసిన ఫ్యాన్స్.. కోహ్లీ మంచి మనసుకు మరోసారి ఫిదా అయ్యారు.
మైదానంలో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా, యారోగెంట్‌గా ఉంటాడని కోహ్లీకి పేరు. అలాంటి కోహ్లీ తాజాగా విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో చేసిన పని తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ విశ్రాంతి తీసుకున్నారు. వీరి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా చాలా వికెట్లు కోల్పోయింది.

ఇలాంటి సమయంలో క్రీజులో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. అప్పుడు వారికి డ్రింక్స్ తీసుకొని కోహ్లీ మైదానంలోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చినా కూడా.. హోటల్‌లో ఉండిపోకుండా మైదానానికి వచ్చిన అతను.. జట్టుకు ఎలాగోలా సాయం చేయాలనే ఉద్దేశ్యంతో డ్రింక్స్ తీసుకొచ్చాడు.
టీమిండియా ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. కోహ్లీతోపాటు టవల్స్ తీసుకొని యుజ్వేంద్ర చాహల్ కూడా వచ్చాడు. ఈ సమయంలో తమ జెర్సీలపై గ్రీన్ కలర్ వెస్ట్‌లు వేసుకొని ఉన్నారీ ఇద్దరు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా కోహ్లీ పెద్ద మనసును మెచ్చుకుంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ మినహా మిగతా భారత బ్యాటర్లు ఎవరూ ఈ మ్యాచ్‌లో రాణించలేదు. దీంతో ఈ జట్టు కేవలం 181 పరుగులకే కుప్పకూలింది. అనంతం లక్ష్య ఛేదనలో విండీస్ కెప్టెన్ షాయి హోప్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆ టీం సునాయాసంగా ఛేజ్ పూర్తి చేసింది.
ఇది విండీస్ గడ్డపై భారత్‌కు ఆరేళ్ల తర్వాత ఎదురైన ఓటమి. తాము సరిగా బ్యాటింగ్ చేయలేదని, అందుకే ఓడిపోయామని తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే మూడు వికెట్లతో రాణించాడు. మిగతా వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు.