Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: టాటూల వెనుక కథ చెప్పిన తిలక్.. టీమిండియాకు ఆడతాడనే అనుకోలేదట!

విండీస్‌తో తొలి టీ20లో భారత్ ఓడినా కూడా.. అరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ మాత్రం తన అద్భుతమైన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. తనలో చాలా సత్తా ఉందని నిరూపించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తొలి పరుగులను సిక్సర్లతో సాధించి, ఫ్యాన్స్‌ను హుషారు చేశాడు.

మిగతా బ్యాటర్లు అందరూ విఫలమైన చోట తాను మాత్రం చాలా సులభంగా భారీ షాట్లు ఆడుతూ అదరగొట్టాడు. ఈ క్రమంలో రెండో టీ20లో కూడా తిలక్ ఎలా ఆడతాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తిలక్‌ను మరో యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్ ఇంటర్వ్యూ చేశాడు.

indvswi-tilak-varma-reveals-the-story-behind-his-tattoos

ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన గురించి మాట్లాడిన తిలక్.. 'విండీస్ బలమైన టీ20 టీం. నేను బేసిక్స్‌ను బాగా గుర్తు చేసుకుంటూ.. నా బలం చుట్టూనే ఇన్నింగ్స్ ఆడా. ఇది నా మొదటి సిరీస్ కాబట్టి.. నా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనుకున్నా' అని చెప్పాడు.

'కొంచెం నెర్వస్‌గా ఉన్నా కూడా నా బెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యా. రాహుల్ సర్‌తో కూడా ఇదే చెప్పా.. నా బెస్ట్ ఆడే ప్రయత్నంలో వికెట్ కోల్పోతే ఏం పర్లేదని ఆయన అన్నారు' అని తిలక్ వెల్లడించాడు. అలాగే తన తొలి ఐపీఎల్ గురించి కూడా మాట్లాడాడు.

'మొదటి ఐపీఎల్‌లో చాలా ఒత్తిడి ఉంటుంది. అవకాశాలు రావాలంటే రాణించక తప్పని పరిస్థితి. ఆ టైంలో నేను టీమిండియాకు ఆడతానని కూడా అనుకోలేదు. కానీ అక్కడ రాణించబట్టే ఇప్పుడు పిలుపు వచ్చింది' అని సంతోషం వ్యక్తం చేశాడు.

ఇటీవలి కాలంలో తిలక్ చాలా టాటూలు వేయించుకుంటున్నాడు. ఈ విషయం గుర్తుచేసిన కిషన్.. 'అసలు ఎందుకీ టాటూలు? మాకు సమాధానం కావాలి?' అని హిలేరియస్‌గా ప్రశ్నించాడు. దీని వెనుక ఉన్న కథను కూడా తిలక్ వెల్లడించాడు. ఇప్పటి వరకు ఎందుక వెయిట్ చేసిందీ చెప్పుకొచ్చాడు.

'చిన్నప్పటి నుంచే నాకు టాటూలు వేయించుకోవాలని ఉంది. అప్పట్లో దీనికి ఎవరూ అనుమతించలేదు. ఆ తర్వాత నా కోచ్‌ను అడిగా.. అప్పుడాయన ఆటపై ఫోకస్ పెట్టాలని చెప్పాడు. ఒక స్థాయికి చేరిన తర్వాత టాటూల్ వేయించుకో అన్నాడు. అందుకే ఇప్పుడు ఇలా..' అంటూ నవ్వేశాడు.

Story first published: Sunday, August 6, 2023, 16:36 [IST]
Other articles published on Aug 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+