Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Varma: అరంగేట్రంలో అదరగొట్టిన తిలక్.. సక్సెస్ వెనుక ఉన్నది అతనే..!

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీసులో ముంబై ఇండియన్స్ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లు అందరూ ఇబ్బంది పడుతున్న పిచ్‌పై సునాయాసంగా పరుగులు చేస్తూ అందర్నీ ఆకర్షించాడు. ఇక రెండో మ్యాచులో హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఇలా అద్భుతమైన అరంగేట్రం సాధించిన తిలక్ వర్మ.. తన సక్సెస్‌కు కారణం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అని చెప్పాడు. అరంగేట్రానికి ముందు ద్రావిడ్ తన టెన్షన్‌ను బాగా తగ్గించాడని తిలక్ చెప్పాడు. విండీస్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచుల్లో భారత బ్యాటింగ్ విభాగం ఏమాత్రం రాణించలేదు. కానీ రెండు మ్యాచుల్లోనూ తిలక్ రాణించిన సంగతి తెలిసిందే.

Tilak Varma

'నేనే అండర్-19 వరల్డ్ కప్ రోజుల నుంచి రాహుల్ ద్రావిడ్‌తో కలిసి పని చేస్తున్నా. బేసిక్స్ ఫాలో అవుతూ.. ఎక్కువ సేపు వికెట్‌పై ఉండాలని ద్రావిడ్ చెప్తూ ఉంటాడు. హార్దిక్ భాయ్ కూడా నాకు అదే చెప్పాడు. దేశవాళీలు, ఐపీఎల్‌లో నువ్వు బాగా ఆడావు.. అదే బేసిక్స్ ఫాలో అవుతూ గేమ్ ఎంజాయ్ చెయ్ అని హార్దిక్ అన్నాడు' అని తిలక్ వెల్లడించాడు.

ఇప్పటి వరకు రెండు ఐపీఎల్ సీజన్లలో తిలక్ వర్మ ఆడాడు. గత ఐపీఎల్‌లో నిలకడగా ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇక ఈ ఏడాది 11 మ్యాచుల్లో 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేటు కూడా 164.11 కావడం గమనార్హం. ఇలా రెండు ఐపీఎల్‌ సీజన్లలో రాణించడంతోపాటు.. దేశవాళీల్లో కూడా తిలక్ సత్తా చాటాడు.

ఈ కారణంగానే టీమిండియా టీ20 టీం పిలుపు అందుకున్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు లేని క్రమంలో.. భారత బ్యాటింగ్ యూనిట్‌ను బలోపేతం చేసేందుకు యువ బ్యాటర్లకు సెలెక్టర్లు అవకాశాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, August 7, 2023, 17:03 [IST]
Other articles published on Aug 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+