Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: గిల్ ఫామ్‌పై ఫ్యాన్స్‌లో టెన్షన్.. రెండో టీ20లో రెచ్చిపోతాడంటున్న మాజీ దిగ్గజం!

వెస్టిండీస్‌తో రెండో టీ20 ఆడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఫ్యూచర్ స్టార్ అనుకున్న శుభ్‌మన్ గిల్ కూడా తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ క్రమంలో రెండో టీ20లో గిల్ రాణిస్తాడని మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అన్నాడు. గిల్‌తోపాటు సూర్యకుమార్ కూడా పరుగులు చేస్తాడన్నాడు. 'నా అంచనా ప్రకారం.. ఈ మ్యాచ్‌లో గిల్, సూర్య కలిసి 50పైగా పరుగులు చేస్తారు. గిల్ ఇప్పటి వరకు ఫైర్ అవ్వలేదు' అని చెప్పాడు.

 INDvsWI Tilak Shubman Gill will fire in second T20i

'గిల్ కనుక నిలకడగా రాణిస్తే.. నెమ్మదిగా తను కూడా సీనియర్ ప్లేయర్ అయిపోతాడు. తను చాలా క్రికెట్ ఆడాడు. కాబట్టి కుర్రాడు అని పిలవడం లేదు. చాలా ట్యాలెంటెడ్ అని చెప్తాం. కానీ గిల్ నిలకడపై ఫోకస్ పెట్టాలి. తను ఆడే స్థానం.. దక్కుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రాణించాలి' అని చోప్రా చెప్పాడు.

ఇక రెండో టీ20లో స్పిన్నర్లు కనీసం ఐదు వికెట్లు తీసుకుంటారని చోప్రా అభిప్రాయపడ్డాడు. అలాగే రెండు టీమ్స్ కలిసి పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయే అవకాశం ఉందన్నాడు. తొలి టీ20లో రెండు టీమ్స్ కూడా పవర్ ప్లేలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగే అవకాశం ఉంది.

ఇక విండీస్ టూర్‌లో గిల్ పెద్దగా రాణించలేదు. టెస్టు సిరీసులో చివరి ఇన్నింగ్స్‌లో కొంత ఫర్వాలేదనిపించాడు. ఇక వన్డే సిరీసులో కూడా తేలిపోయాడు. చివరి వన్డేలో మాత్రమే రాణించాడు. మిగతా రెండింట్లో పెద్దగా రాణించలేదు. త్వరలోనే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో గిల్ ఫామ్ చూసిన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Story first published: Sunday, August 6, 2023, 17:28 [IST]
Other articles published on Aug 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+