Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI : ఈ ముగ్గుర్నీ ఎదుర్కోకపోతే.. విండీస్ చేతిలో టీమిండియాకు ఓటమి తప్పదు!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత భారత జట్టు విండీస్ పర్యటనలో బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. ఈ సిరీసులో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. వీటితోనే కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌ను భారత్ ప్రారంభిస్తుంది. అయితే భారత జట్టులో అనుభవం లేని పేస్ బౌలింగ్, ఫామ్‌లో లేని బ్యాటింగ్ పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ముగ్గురు విండీస్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్తగా ఉండకపోతే ఈ సిరిసులో ఓటమి ఎదురు చూడొచ్చు!

కార్లోస్ బ్రాత్‌వైట్: ప్రస్తుతం అన్ని జట్లు టెస్టుల్లో వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తుంటే.. విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ మాత్రం 1990ల్లో బ్యాటర్‌లా సంప్రదాయబద్దమైన టెస్టు క్రికెట్ ఆడతాడు. రోజుల తరబడైనా బ్యాటింగ్ చేసే ఓపిక బ్రాత్‌వైట్ సొంతం. గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను చికాకు పెట్టడం అతని స్పెషాల్టీ. అతన్ని త్వరగా అవుట్ చేయలేకపోతే.. అనుభవం లేని భారత బౌలింగ్ ఎటాక్‌ను అతను బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

They need to be aware of these three threats

టగనరైన్ చందర్‌పాల్‌: తండ్రి శివనరైన్ చందర్‌పాల్‌లాగే టగనరైన్ కూడా అద్భుతమైన బ్యాటర్. బ్రాత్‌వైట్ కన్నా కొంచెం వేగంగా ఆడినా కూడా.. ఎక్కువ సేపు క్రీజులో ఉండటమే ఇతని స్పెషాల్టీ కూడా. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో అతన్ని అడ్డుకోకుంటే.. భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆసీస్‌పై అరంగేట్రంలోనే ఆకట్టుకున్న అతను.. కెప్టెన్ బ్రాత్‌వైట్‌తో కలిసి విండీస్‌కు ఇటీవలి కాలంలో అద్భుతమైన ఆరంభాలు అందిస్తుండటం గమనార్హం.

రకీం కార్న్‌వాల్: ఫ్యాన్స్ ప్రేమగా జింబో అని పిలిచే భారీ ఆఫ్‌స్పిన్నర్ రకీం కార్న్‌వాల్. అద్భుతంగా బంతిని స్పిన్ చేస్తూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడం అతని స్పెషాల్టీ. ఎత్తు కూడా ఎక్కువే అవడంతో మంచి బౌన్స్ కూడా రాబడతాడు. ఇక బ్యాటుతో కూడా రాణించే సత్తా జింబోకు ఉంది. అయితే భారత బ్యాటర్లు ఎడం చేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జింబో బదులుగా జోమెల్ వారికన్‌కు అవకాశం దక్కొచ్చు. కానీ జింబోకు అవకాశం దక్కితే మాత్రం అతనితో ప్రమాదమే.

Story first published: Sunday, July 9, 2023, 12:13 [IST]
Other articles published on Jul 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+