Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: పుజారా స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్లు వీళ్లే.. అదే జరిగితే ‘నయావాల్’ ఖేల్‌ఖతం!

వెస్టిండీస్ పర్యటనలో టెస్టులు ఆడే భారత జట్టు నుంచి ఛటేశ్వర్ పుజారాను తప్పించారు. అతను కొంత కాలంగా కౌంటీల్లో చెలరేడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ రెండు ఇన్నింగ్సుల్లోనూ పుజారా దారుణంగా ఫెయిలయ్యాడు. దీంతో అతన్ని టెస్టు జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించారు. ఈ క్రమంలో పుజారా స్థానాన్ని భర్తీ చేయగలిగే ప్లేయర్లు ఎవరంటే?

INDvsWI

అజింక్య రహానే
వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే అద్భుతమైన ఆటతో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. విండీస్‌తో సిరీస్‌లో అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమించారు. అతన్ని మూడో స్థానానికి ప్రమోట్ చేయడం మంచి స్ట్రాటజీ అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడంలో కూడా రహానే నిష్ణాతుడు. అతని ఓవర్సీస్ రికార్డు చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అలాగే విండీస్‌పై అతని రికార్డు కూడా అద్భుతంగా ఉంది.

INDvsWI

యశస్వి జైస్వాల్
టెస్టు జట్టుకు తొలిసారి ఎంపికైన జైస్వాల్ ప్రధానంగా ఓపెనింగ్ బ్యాటర్‌. దేశవాళీల్లో కూడా ఓపెనింగ్ చేసేవాడు. అయితే దేశవాళీ బౌలింగ్ ఎటాక్‌కు, అంతర్జాతీయ బౌలింగ్ దళానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అతన్ని ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో పంపడం వల్ల అతనిపై ఒత్తిడి తగ్గుతుంది. దేశవాళీల్లో 15 మ్యాచుల్లో 80పైగా సగటుతో 1845 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్. కాబట్టి మరీ ఒత్తిడి పెట్టకుండా ఉంటే జైస్వాల్ అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది.

INDvsWI

శుభ్‌మన్ గిల్
ప్రస్తుతం ఓపెనర్‌గా వస్తున్న శుభ్‌మన్ గిల్‌ను మూడో స్థానంలో పంపడం మరో ఆల్టర్‌నేటివ్. ఎందుకంటే అతను పంజాబ్‌కు ఈ స్థానంలోనే ఆడతాడు. కాబట్టి అనుభవం కూడా ఉంది. అదే సమయంలో టీమిండియా ఓపెనర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అతను అంత అద్భుతాలు సృష్టించలేదు. మొత్తం 16 టెస్టుల్లో 32.89 సగటుతో 921 పరుగులు చేశాడు. అదే తనకు కలిసొచ్చిన మూడో స్థానంలో అతను రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Story first published: Monday, June 26, 2023, 16:32 [IST]
Other articles published on Jun 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+