వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో కూడా టీమిండియా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తడబడిన ఈ టీం చివరకు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. కొందరు ఆటగాళ్లు తేలిపోవడం వల్లనే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. వాళ్లు ఎవరంటే..
శుభ్‌మన్ గిల్:చివరగా భారత్ తరఫున ఆడిన టీ20 సిరీసులో సెంచరతో చెలరేగాడీ పంజాబ్ కుర్రడు. కానీ ఆ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో తేలిపోయాడు. తొలి టీ20లో కేవలం మూు పరుగులు చేసన అతను.. రెండో మ్యాచ్‌లో ఏడు పరుగులే చేయగలిగాడు. ఓపెనర్ స్థానం కోసం యశస్వి జైవాల్ పోటీలో ఉన్నాడు. మరి అతనికి అవకాశం కూడా ఇవ్వకుండా గిల్‌నే కొనసాగిస్తారా? అనేది ప్రశ్న.

ముఖేష్ కుమార్:విండీస్ టూర్‌లో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ప్లేయర్ ముఖేష్. తొలి టీ20లో అరంగేట్రం చేసిన అతను ఫర్వాలేదనిపించాడు. కానీ రెండో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో దంచికొడుతున్న నికోలస్ పూరన్‌ను పెవిలియన్ చేర్చాడు. కానీ ఆ తర్వాత అతని బౌలింగ్‌లో జోసెఫ్ బాదిన సిక్సర్‌తో మ్యాచ్ పూర్తిగా చేజారింది. అసలే వైట్ బాల్ క్రికెట్‌లో పెద్దగా రికార్డులు లేని అతను.. ఈ మ్యాచ్‌లో అనుభవం కూడా లేదని నిరూపించుకున్నాడు.
సంజూ శాంసన్:తొలి టీ20లో సంజూను ఆడించలేదని పలురువు నిలదీశారు. కానీ సంజూ వరుసగా రెండు మ్యాచుల్లో విఫలం అయ్యాడు. తొల టీ20లో రనౌట్ అయినా అతను... ఈ మ్యాచ్‌లో భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. తను ఏమాత్రం రాణించి ఉన్నా భారత జట్టు మెరుగైన స్కోరు చేసి ఉండేది. అతనికి మూడో టీ20లో చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది.
ఓవరాల్‌గా చూసుకున్నా కూడా పొట్టి ఫార్మాట్‌లో సంజూ రికార్డు అంత గొప్పగా లేదు. మొత్తం తన కెరీర్‌లో 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన అతని సగటు కేవలం 18.82 మాత్రమే. అలాగే 131 స్ట్రైక్ రేటుతో ఆడిన అతను కేవలం ఒకే ఒక్కసారి హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. చివరి ఐదు మ్యాచుల్లో ఒక్కసారి కూడా కనీసం 30 పరుగుల మార్కు దాటలేకపోయాడు.