For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsWI: నాలుగో టీ20లో టాప్ స్కోర్ చేసే బ్యాటర్లు వీళ్లే.. కళ్లన్నీ తిలక్ పైనే..!

భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీసులో బ్యాటర్లు రాణించడం చాలా కీలకం. ఏ టీం బ్యాటర్లు రాణిస్తే ఆ టీం గెలవడం గ్యారంటీ. అదే సమయంలో నాలుగో టీ20లో భారత్ తప్పక గెలవాలి. లేదంటే సిరీస్ విండీస్ వశం అవుతుంది. మరి ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసే అవకాశం ఉన్న బ్యాటర్లు ఎవరంటే?

సూర్యకుమార్ యాదవ్
మూడో టీ20లో ఫామ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. నాలుగో మ్యాచులో కూడా కీలకం కానున్నాడు. సూర్య మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు అతన్ని అడ్డుకోవడం ఎవరికైనా కష్టమే. ఈ ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్.. ఇదే జోరు కొనసాగిస్తే నాలుగో టీ20లో కూడా అతను చెలరేగడం గ్యారంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

INDvsWI:

నికోలస్ పూరన్
సిరీస్ నెగ్గాలంటే విండీస్ కచ్చితంగా నెగ్గాల్సిన ఈ మ్యాచ్‌లో ఆ టీం బ్యాటింగ్ ఎక్కువగా నికోలస్ పూరన్‌పై ఆధారపడనుంది. ఈ సిరీస్ మొత్తం పూరన్ అద్భుతంగా రాణిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో పూరన్ చాలా గొప్ప ఫామ్‌లో ఉన్నాడు.

INDvsWI:

అతను కనుక మరోసారి చెలరేగితే ఈ మ్యాచ్‌లో విండీస్ విజయం ఖాయం అని చెప్పొచ్చు. అయితే ఫ్లోరిడాలో అతని రికార్డు అంత గొప్పగా లేకపోవడం గమనార్హం.

తిలక్ వర్మ
ఈ సిరీసులో భారత్ తరఫున నిలకడగా రాణిస్తున్న ఏకైక బ్యాటర్ తిలక్ వర్మ. ఈ కొత్త కుర్రాడు మూడు మ్యాచుల్లో 139 పరుగులు చేసి, సిరీసులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గత మ్యాచ్‌లో 49 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్.. నాలుగో టీ20లో కూడా చాలా కీలకం కానున్నాడు.

INDvsWI:

ప్రస్తుతం తిలక్ ఉన్న ఫామ్ చూస్తుంటే.. ఈ మ్యాచ్‌లో అతను మరో భారీ స్కోరు చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఇలా రాణించడం ద్వారా పొట్టి ఫార్మాట్లో టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని తిలక్ అనుకుంటున్నాడు.

Story first published: Saturday, August 12, 2023, 16:08 [IST]
Other articles published on Aug 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+