విండీస్‌తో తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. దీంతో రెండో వన్డేలో సీనియర్లు రోహిత్, కోహ్లీలను మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది. వారి స్థానాల్లో కొత్త కుర్రాళ్లు చోటిచ్చింది. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టి టీమిండియా ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో మూడో వన్డేలో మళ్లీ సీనియర్ల పునరాగమనం గురించి చర్చ జరుగుతోంది. అయితే కొన్ని కారణాల వల్ల వారిని ఈ మ్యాచ్ ఆడించకపోతేనే మంచిది.. అవేంటంటే?
ఒక్క మ్యాచ్‌తో తేల్చేస్తారా?:రెండో వన్డేలో కోహ్లీ, రోహిత్‌ను పక్కన పెట్టిన టీమిండియా.. సూర్యకుమార్, సంజూ శాంసన్‌ను ఆడించింది. వీళ్లిద్దరూ కూడా వన్డే వరల్డ్ కప్ కోసం పోటీ పడుతున్నారు. ఈ సిరీసులో రాణిస్తే వరల్డ్ కప్ బృందంలో వీరికి ఛాన్స్ దక్కుతుంది. కానీ ఇద్దరూ రెండో వన్డేలో ఫెయిలయ్యారు.

ఈ క్రమంలో ఈ ఇద్దరికీ మరొక్క ఛాన్స్ ఇవ్వడమే బెటర్ ఆప్షన్‌లా కనిపిస్తోంది. ముఖ్యంగా శాంసన్‌కు మరొక ఛాన్స్ అయినా ఇవ్వాలి. కేవలం ఒక్క మ్యాచ్ చూసి అతని భవితవ్యం తేల్చేయడం కరెక్ట్ కాదు కదా.
కొత్త కుర్రాళ్లకు సవాల్..:ఈ సిరీస్ మొదలవడానికి ముందు టీమిండియా 3-0తో గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ కుర్రాళ్లు తేలిపోవడంతో రెండో వన్డేలో భారత్ ఓడింది. ఇక మూడో మ్యాచులో కూడా వాళ్లనే ఆడిస్తే.. వాళ్లకు ఇదొక సవాల్‌గా మారుతుంది.

దీన్ని అధిగమించడడానికి వాళ్లు కచ్చితంగా మెరుగవ్వాల్సి వస్తుంది. దీంతో గిల్, కిషన్, శాంసన్, సూర్య తదితరుల క్యారక్టర్ బయటపడుతుంది. గెలిస్తే వాళ్ల కాన్ఫిడెన్స్ మరో స్థాయికి చేరుతుంది.
పెద్ద పిక్చర్‌పై ఫోకస్..:రెండో వన్డేలో ఓడినా కూడా తమ ఫోకస్ బిగ్గర్ పిక్చర్‌పై ఉందని రాహుల్ ద్రావిడ్ మరీ మరీ చెప్పాడు. అదే నిజమైతే.. మూడో వన్డే గెలవడానికి టీమిండియా అంత ఆత్రుత పడాల్సిన అవసరం లేదు. అలా జరగాలంటే కోహ్లీ, రోహిత్‌ను ఆడించాల్సి వస్తుంది.
కొత్త కుర్రాళ్లకు గేమ్ టైం అవసరం అని ద్రావిడ్ పదే పదే చెప్పాడు. అలాంటప్పుడు కేవలం ఒక్క గేం ఆడించడం కరెక్ట్ కాదు. వాళ్లను మూడో వన్డేలో కూడా కొనసాగించడమే మంచిది.కుమార్.