వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత్‌కు శుభారంభం అందించడంలో గిల్, కిషన్ జోడీ ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రెండో టీ20లో కుర్రాడు యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలని అడుగుతున్నారు.
జట్టులో సంజూ శాంసన్ రూపంలో వికెట్ కీపర్ ఆప్షన్ ఉంది కాబట్టి.. కిషన్ లేకపోయినా ఏం పర్లేదని, అతని స్థానంలో జైస్వాల్‌ను ఆడించాలని అంటున్నారు. దీనిపై మాజీ లెజెండ్ వసీం జాఫర్ కూడా మాట్లాడాడు. రెండో టీ20లో జైస్వాల్‌ను ఆడిస్తే చూడాలని ఉందన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జైస్వాల్ అద్భుతమైన ఫామ్ కనబరిచిన సంగతి తెలిసిందే.

అలాగే పొట్టి ఫార్మాట్‌లో కిషన్ ఫామ్ కోల్పోతున్న విషయాన్ని జాఫర్ గుర్తుచేశాడు. 'జైస్వాల్ ఆడితే చూడాలని అనుకుంటున్నా. కిషన్ టీ20 ఫామ్ అంత గొప్పగా లేదు. తన చివరి 15 ఇన్నింగ్సుల్లో ఒక్కసారి కూడా కనీసం 40 పరుగులు చేయలేదు. స్ట్రైక్ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. అతని స్థానంలో జైస్వాల్‌ను ఆడిస్తే బాగుంటుందని నా అభిప్రాయం' అని అన్నాడు.
వన్డేల్లో కిషన్ ఫామ్ బాగుందని, కానీ టీ20లు వేరే ఫార్మాట్ అనే విషయం మర్చిపోకూడదని చెప్పాడు. 'ఐపీఎల్‌లో చెలరేగిన కుర్రాడికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా జైస్వాల్ అందుకున్నాడు' అని గుర్తుచేశాడు. అదే సమయంలో కిషన్ ఎంపికను కూడా డిఫెండ్ చేశాడీ మాజీ లెజెండ్. మొదటి టీ20 మ్యాచ్ చాలా కఠినమైన పిచ్‌పై జరిగిందని చెప్పాడు.
'మొదటి టీ20 జరిగిన పిచ్ చాలా కఠినంగా ఉంది. అలాంటి పిచ్‌పై కిషన్, గిల్ జోడీ ధారాళంగా పరుగులు చేయాలని అనుకోవడం పొరపాటే. కాబట్టి వారిని మరీ ఎక్కువగా విమర్శించలేం. రెండో టీ20లో పిచ్ ఎలా ఉంటుందో చూడాలి. పిచ్ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలించినా.. మన బ్యాటర్లు చెలరేగడం ఖాయం' అని తేల్చిచెప్పాడు. తొలి టీ20లో భారత జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.