వెస్టిండీస్‌తో జరిగిన తలి టీ20లో ఫేవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో భారత జట్టుకు కొన్ని పాఠాలు తెలిశాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు చేసిన కొన్ని తప్పులు కూడా బయట పడ్డాయి. అలా టీమిండియా చేసిన తప్పులు ఏవో ఒకసారి చూస్తే..
బ్యాటింగ్ డెప్త్..:
ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ అంతగా లేకుండా పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తర్వాత ఆరో స్థానంలో సంజూ శాంసన్ వచ్చాడు. ఆ తర్వాత అక్షర్ వచ్చాడు. అక్షర్ అనంతరం టీమిండియాలో సరైన బ్యాటింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో అక్షర్‌పై బాగా ఒత్తిడి పెరిగింది.

చివర్లో టీమిండియా ఒక్క బౌండరీ తేడాతో ఓటమిపాలైంది. అదే కనుక మరొక బ్యాటర్ కనుక టీంలో ఉండి ఉంటే.. టీం ఈజీగా గెలిచేది. ఈ విషయంలో టీం మేనేజ్‌మెంట్ కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
బ్యాటింగ్ పొజిషన్స్..:
సుమారు 2021 నుంచి సంజూ శాంసన్ తొలి పవర్‌ప్లేలోనే బ్యాటింగ్‌కు వచ్చేస్తున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో మరో 9 ఓవర్లు మిగిలుండగా సంజూ బ్యాటింగ్‌కు వచ్చాడు. తను కొన్ని మంచి షాట్లు ఆడాడు. కానీ ఈ కొత్త రోల్‌లో సడెన్‌గా అడ్జస్ట్ అవడం ఎవరికైనా కష్టమే కదా.

నాలుగో స్థానంలో తిలక్ అద్భుతంగా ఆడిన మాట వాస్తవమే. అయితే కనీసం హార్దిక్ కన్నా ముందు అయినా సంజూను పంపాల్సింది. గతంలో ఫినిషర్‌గా ఉన్నాడు కాబట్టి.. ఈ రోల్ పాండ్యాకు కొత్తదేం కాదు కూడా.
బాధ్యత లేని బ్యాటింగ్..:
ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్ ముగిసే సరికి భారత జట్టు దగ్గర ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. మరో 37 పరుగులు చేస్తే టీం గెలిచేస్తుంది. హార్దిక్, సంజూ ఇద్దరూ క్రీజులో ఉన్నారు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఒకరి తర్వాత ఒకరుగా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

అక్షర్ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు ఎవరిని పంపాలో కూడా మేనేజ్‌మెంట్ డిసైడ్ అవ్వలేకపోయింది. చాహల్‌ను మైదానంలో పంపి, వెంటనే వెనక్కు పిలిచారు. మళ్లీ చివరకు అతన్నే పంపారు. ఇలా ఒక క్లియర్ డెసిషన్ లేకపోవడం, బ్యాటింగ్ లైనప్ కుప్పకూలుతుంటే బాధ్యతగా ఆడే వాళ్లు లేకపోవడం కూడా టీంను దెబ్బతీసింది.