విండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో మరోసారి యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విఫలమయ్యాడు. అతనితోపాటు ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ కూడా ఫెయిలయ్యాడు. గయానా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు.
జట్టుకు మంచి ఆరంభం ఇచ్చేందుకు ప్రయత్నించిన జైస్వాల్.. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్ నాలుగో బంతికే భారీ షాట్ ఆడబోయాడు. ఓబెడ్ మెకాయ్ వేసిన ఈ బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో గాల్లోకి ఎత్తుగా లేచిందీ బంతి.

దీన్ని ఎలాంటి పొరపాటు చేయకుండా అల్జారీ జోసెఫ్ అందుకున్నాడు. దీంతో జైస్వాల్ తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచులో కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అదే సమయంలో తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో అయినా రాణిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు.
కానీ గిల్ మరోసారి విఫలమై అందర్నీ నిరాశ పరిచాడు. జైస్వాల్ అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. చూడచక్కని షాట్లతో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. దీంతో గిల్‌పై పెద్దగా ఒత్తిడి పడలేదు. అయినా సరే అనుకున్న షాట్లు ఆడటంలో గిల్ తడబడ్డాడు. ఈ క్రమంలో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయాడు.
ఐదో ఓవర్ వరకు క్రీజులోనే ఉన్న అతను 11 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు. దీంతో మరోసారి ఒత్తిడికి లోనైన గిల్ భారీ షాట్ ఆడబోయాడు. కానీ బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో జాన్సన్ చార్లెస్‌కు క్యాచ్ ఇచ్చాడు. కుడి చేతి వైపు రన్నింగ్ చేస్తూ చార్లెస్ చక్కని క్యాచ్ అందుకోవడంతో గిల్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది.
ఇలా టీమిండియా ఓపెనర్లు మరోసారి ఫెయిలవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓపెనర్లు ఇలాగేనా ఆడేది? అని నిలదీస్తున్నారు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓపెనర్లు విఫలం అవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.