Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: నాలుగో టీ20లో నెగ్గాలంటే.. టీమిండియా ఇలా చేయక తప్పదు!

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీసులో భారత జట్టు 2-1 తేడాతో వెనకబడి ఉంది. సిరీస్ ఆరంభంలోనే ఈ జట్టు వరుసగా రెండు ఓటములు చవిచూసింది. మూడో మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. నాలుగో మ్యాచ్ కూడా గెలవాలంటే కొన్ని విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి. అవేంటంటే?

స్పిన్నర్లే కీలకం: నాలుగో టీ20 జరిగే ఫ్లోరిడాలోని స్టేడియం చిన్నది. కాబట్టి ఇక్కడ స్పిన్నర్లు కొంత కీలకం కానున్నారు. ప్రస్తుతానికైతే రెండు టీమ్స్ వద్ద క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. మరి టీమిండియా ఈ మ్యాచ్‌లో తమ స్పిన్ బౌలింగ్ విభాగంలో ఏమైనా టింకరింగ్‌లు చేస్తుందేమో చూడాలి.

Team India needs to take key decisions to win the fourth INDvsWI T20I

ఈ మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడిస్తే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ నిర్ణయమే మ్యాచ్‌ను మలుపు తిప్పే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడి ఛాలెంజింగ్ పరిస్థితుల్లో చాహల్, కుల్దీప్ ఇద్దర్నీ ఆడించే అవకాశాలు పెద్దగా లేవు. కాబట్టి ఈ మ్యాచ్‌లో అక్షర్ కీలకం అని చెప్పొచ్చు.

శుభ్‌మన్ శుభారంభం: విండీస్ టూర్ ప్రారంభం అయినప్పటి నుంచి దారుణంగా విఫలం అవుతున్న ప్లేయర్ శుభ్‌మన్ గిల్. అతను మూడో వన్డే మినహా ఒక్క మ్యాచ్‌లో కూడా పరుగులు చేయలేదు. ఇక టీ20 సిరీసులో అయితే అతని ఆటతీరు దారుణమనే చెప్పాలి.

అయితే నాలుగో మ్యాచ్ యూఎస్ఏలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతోంది. ఇలా దేశం మారడం అతని ఆటతీరుపై ప్రభావం చూపించి, అతను రాణిస్తే టీమిండియాకు చాలా మంచిది. గిల్ కనుక మంచి స్కోరు చేస్తే అది కచ్చితంగా టీంకు ఉపయోగపడుతుందని చెప్పాలి.

ప్రయోగాలకు ఫుల్‌స్టాప్: టీమిండియాలోకి వస్తారా? లేదా? అని అనుమానం ఉన్న కొత్త కుర్రాళ్లకు ఈ సిరీసులో అవకాశం ఇవ్వాలని, తద్వారా టీంలో అనేక ప్రయోగాలు చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే విండీస్‌తో టీ20ల్లో తెగ ప్రయోగాలు చేస్తోంది.

దీని వల్ల జట్టుకు పెద్దగా ఉపయోగం లేదు. ఈ కొత్త కొత్త ప్రయోగాల వల్ల జట్టు నిలకడ దెబ్బతిన్నదని చెప్పాలి. తాము వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని టీంలో మార్పులు చేస్తున్నామని హార్దిక్ చెప్పాడు. కానీ సిరీస్ ఓడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ మార్పులకు ఫుల్‌స్టాప్ పెట్టేయడమే మంచిది.

Story first published: Saturday, August 12, 2023, 8:38 [IST]
Other articles published on Aug 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+