Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిరీస్ ఓడిన తర్వాత.. టీమిండియాకు తెలిసొచ్చిన మూడు పాఠాలు!

వెస్టిండీస్ చేతిలో 17 ఏళ్ల తర్వాత సిరీస్ ఓడిపోయింది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్ ఆరంభంలోనే వరుసగా రెండు ఓటములు చవిచూసిన భారత జట్టు.. ఆ తర్వాత మ్యాచుల్లో పుంజుకొని రెండు విజయాలు సాధించింది. కానీ నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో మళ్లీ ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు.

పొట్టి ఫార్మాట్‌లో బ్యాటింగ్ కీలకం: టీ20 ఫార్మాట్‌లో టీమిండియా మరింత ఎగ్రెసివ్‌గా ఆడాలని కెప్టెన్ రోహిత్ శర్మ గతేడాది నుంచి చెప్తున్నాడు. ఇప్పుడు సీనియర్లు టీంలో లేకోయినా టీం కాంబినేషన్ ఏమాత్రం కుదరక జట్టు ఇబ్బంది పడుతోంది.

INDvsWI Team India must learn these lessons after the loss

విండీస్‌తో ఆడిన ఐదు మ్యాచుల్లో కూడా టీమిండియా బ్యాటింగ్ లైనప్ అక్షర్ పటేల్‌తో ముగిసింది. అతను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అదే సమయంలో విండీస్‌లో పదో నెంబర్ వరకు భారీ షాట్లు ఆడగల ప్లేయర్లు ఉన్నారు. ఇదే భారత ఓటమికి కారణమని ద్రావిడ్ కూడా ఒప్పుకున్నాడు.

ఫినిషర్ లేడు: ఈ సిరీసులో టీమిండియాలో మరింత స్పష్టంగా కనిపించిన లోపం ఫినిషర్ లేని లోటు. ఈ సమస్య గతేడాది నుంచి టీమిండియాను వెంటాడుతూనే ఉంది. విండీస్‌లో ఈ పాత్రలో సంజూ శాంసన్‌, హార్దిక్ పాండ్యాను ట్రై చేశారు. కానీ ఇద్దరూ పెద్దగా ఆకట్టుకోలేదు.

కాబట్టి ఇకనైనా రింకూ సింగ్, జితేశ్ శర్మ వంటి న్యాచురల్ ఫినిషర్లను జట్టులోకి తీసుకోవడం మంచిది. టాపార్డర్ ప్లేయర్ అయినా సంజూను ఫినిషర్‌గా పంపడం వల్ల జట్టుకు నష్టమే ఎక్కువ. ఇప్పటికైనా ఈ విషయం అర్థం చేసుకొని, స్పెషలిస్టు ఫినిషర్‌ను టీమిండియా రెడీ చేసుకుంటే మంచిది.

INDvsWI Team India must learn these lessons after the loss

చాహల్ కథ ముగిసినట్లే: పొట్టి ఫార్మాట్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెరీర్ కూడా దాదాపు ముగిసినట్లే. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఆడని చాహల్.. ఆ తర్వాత టీంలో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ నిలకడగా రాణించడం లేదు. విండీస్ టూర్‌లో ఇది మరోసారి స్పష్టమైంది.

ఫీల్డింగ్‌లో కూడా చాహల్ తేలిపోతున్నాడు. ఇక అతని నుంచి బ్యాటింగ్‌లో ఏమీ ఆశించలేం. కేవలం వికెట్లు తీసుకుంటాడనే కారణంతోనే అతన్ని టీంలోకి తీసుకున్నారు. కానీ చివరి టీ20లో అతన్ని విండీస్ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో చాహల్‌ను ఈ ఫార్మాట్‌లో పక్కన పెట్టేయడమే మంచిదని నిపుణుల సలహా.

Story first published: Tuesday, August 15, 2023, 12:20 [IST]
Other articles published on Aug 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+