వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో చిత్తుగా ఓడిన భారత్‌కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు చివరి వరకు పోరాడినా కూడా నాలుగు పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో సమయానికి తమ కోటా ఓవర్లు పూర్తి చేయడంలో టీమిండియా విఫలమైంది. టైం అయిపోయే సరికి టీమిండియా మరో ఓవర్ వేయాల్సి ఉంది. దీంతో ఈ టీం మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అదే సమయంలో విండీస్ రెండు ఓవర్లు లేట్‌గా వేసింది. దీంతో ఆ టీంకు 10 శాతం జరిమానా విధించారు.

ఇలా ఈ రెండు టీమ్స్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడంతో రిచీ రిచర్డ్‌సన్ నేతృత్వంలోని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. రెండు టీమ్స్‌కు కేటాయించిన టైంను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22లోని రూల్స్ ప్రకారం ఈ జరిమానా విధించారు.
ఈ రూల్ ప్రకారం ఒక టీం తమకు కేటాయించిన సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోతే.. అప్పటి నుంచి వేసే ప్రతి ఓవర్‌కు ఐదు శాతం చొప్పున ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. మ్యాగ్జిమమ్ 50 శాతం వరకు ఇలా కోత విధించే అవకాశం ఉంది. ఈ నిబంధనల ప్రకారం విధించిన జరిమానాలను రెండు టీమ్స్ కెప్టెన్లు అంగీకరించినట్లు సమాచారం.
ఇద్దరు కెప్టెన్లు తమ తప్పులు అంగీకరించడంతో ఈ విషయంపై అధికారిక హియరింగ్ ఉండదని తెలుస్తోంది. ఈ మ్యాచ్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లు గ్రెగరీ బ్రాత్‌వైట్, ప్యాట్రిక్ గుస్టార్డ్‌తోపాటు థర్డ్ అంపైర్ నిగెల్ డుగూడ్, ఫోర్త్ అంపైర్ లెస్లీ రీఫర్ ఈ జరిమానాలు విధించారు.