Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: టీ20ల నుంచి గిల్ అవుట్.. ఆ స్థానంలో ఆడేది ధోనీ శిష్యుడే!

గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. పసికూనలపై ప్రతాపం చూపించిన టీమిండియా.. బలమైన జట్ల ముందు తేలిపోయింది. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్ ఆసాంతం భారత జట్టుకు సరైన ఆరంభాలు లభించలేదు. ఈ క్రమంలోనే ఈ ఫార్మాట్ నుంచి సీనియర్లను బీసీసీఐ తప్పించింది.

తాాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టులో పలు మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే విండీస్ టూర్‌లో కీలక నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ అనుకుంటోందట. విండీస్‌లో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. ఈ పర్యటనలో టీ20 జట్టు నుంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను తప్పించాలని బీసీసీఐ అనుకుంటోందట.

INDvsWI

వన్డే, టెస్టు జట్లలో చాలా కీలకంగా మారిన గిల్‌ను పక్కన పెట్టడం అంటే మాటలు కాదు. అయితే అతనికి కూడా సరైన విశ్రాంతి ఇవ్వాలని, లేదంటే గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. అసలే ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో అతనికి సరిపడా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. అందుకే పొట్టి ఫార్మాట్‌లో అతన్ని ఆడించకుండా రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిందట.

అతని స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టులో చోటు ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టీ20 మ్యాచులు ఆడిన గైక్వాడ్ కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 57 పరుగులే. అయితే ప్రస్తుతం గైక్వాడ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

INDvsWI

ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం 16 మ్యాచులు ఆడిన గైక్వాడ్ 42.14 సగటు, 147.50 స్ట్రైక్ రేటుతో 590 పరుగులు చేశాడు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతనికి టీ20 ఫార్మాట్‌లో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు అనుకుంటున్నారట.

Story first published: Friday, June 23, 2023, 14:40 [IST]
Other articles published on Jun 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+