Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WIvsIND : ఫీల్డింగ్ చేస్తూ.. కరీబియన్ మ్యూజిక్‌కు కాలు కదిపిన గిల్! (వీడియో)

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి పట్టు సాధించింది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లంతా చాలా సంతోషంగా ఉన్నారు. మైదానంలో కూడా చిల్ అవుతూ కనిపించారు. ఇలాంటి ఒక ఘటన తొలి రోజు ఆటలో కనిపించింది. వెస్టిండీస్ జట్టు ఆడుతున్న సమయంలో టీమిండియా యంగ్ స్టార్ శుభ్‌మన్ గిల్ మైదానంలో డ్యాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు.

తొలి రోజు ఆటలో స్టార్ ఎవరు అంటే.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అని చెప్పాలి. అద్భుతంగా బౌలింగ్ చేసిన అతను ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అతనితోపాటు రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లతో రాణించాడు. దీంతో విండీస్ జట్టు 64.3 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ చక్కగా ఆడటంతో.. ఆ రోజు చివరకు టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 80 పరుగులతో నిలిచింది.

Team India young sensation Shubman Gill was in good mood

విండీస్ ఇన్నింగ్స్ 63వ ఓవర్ వేసే సమయంలో గిల్.. పిచ్‌కు దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పటికే విండీస్ 9 వికెట్లు కోల్పోయింది. క్రీజులో రకీమ్ కార్న్‌వాల్, జోమెల్ వారికన్ ఉన్నారు. ఆ సమయంలో మైదానంలో కరీబియన్ మ్యూజిక్ ప్లే చేశారు. ఆ మ్యూజిక్‌కు గిల్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో గిల్‌కు ఎదురుగా కోహ్లీ కూడా ఉన్నాడు. అయితే కోహ్లీ కాలు కదపలేదు. గిల్ మాత్రం ఆ సిచ్యుయేషన్‌ను తెగ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడనే సంగతి తెలిసిందే. దీని గురించి టీం మేనేజ్‌మెంట్ తనను అడిగినట్లు గిల్ చెప్పాడు. 'నువ్వు ఎక్కడ బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నావ్?' అని అతన్ని అడిగారట.

'అప్పుడే నేను మూడో స్థానంలో ఆడతానని చెప్పా. నేను ఆ ప్లేస్‌లో సుస్థిరం అవ్వాలని అనుకుంటున్నా. కొత్త బంతిని ఎదుర్కోవడం ఎప్పుడూ మంచిదే. నాక్కూడా ఓపెనర్‌గా అనుభవం ఉంది. ఇక మూడో స్థానంలో ఆడుతున్నా పెద్ద తేడా ఉండదు' అని గిల్ చెప్పాడు. ఇలా టీం మేనేజ్‌మెంట్ అడిగిందంటే గిల్ సీనియర్ ప్లేయర్ అయిపోయినట్లేనా? అని అడిగితే అలా అస్సలు ఫీలవ్వడం లేదని నవ్వేశాడీ యంగ్ సెన్సేషన్.

Story first published: Thursday, July 13, 2023, 17:36 [IST]
Other articles published on Jul 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+