Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: పుజారా ప్లేస్‌లో గిల్ మళ్లీ ఫెయిల్.. ప్రిన్స్ పనైపోయిందంటూ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే వరకు భారత టీంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్ ఎవరు? అంటే చటుక్కున అందరూ శుభ్‌మన్ గిల్ పేరు చెప్పారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఆ తర్వాత జరుగుతున్న విండీస్ టూర్‌లో కూడా గిల్ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. యశస్వి జైస్వాల్ రాకతో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న గిల్ తేలిపోతున్నాడు.

ఛటేశ్వర్ పుజారా వంటి సీనియర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే. కానీ కనీసం తన స్థాయి ప్రదర్శన మాట అటుంచితే గిల్ కనీసం ఆకట్టుకునే ప్రదర్శన కూడా చేయలేకపోతున్నాడు. తొలి టెస్టులో కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరిన అతను.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పది పరుగులు చేసి అవుటయ్యాడు. బంతి ఎటు స్వింగ్ అవుతుందో అంచనా వేయలేక కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.

 INDvsWI Shubman Gill brutally trolled for failing in second test

రెండో టెస్టులో తను ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీ తరలించేందుకు గిల్ ప్రయత్నించడం చాలా మందికి నచ్చలేదు. అతను చేసిన పది పరుగుల్లో రెండు బౌండరీలు ఉన్నాయి. అవి కూడా అతను కాన్ఫిడెంట్‌గా కొట్టినవి కాదు. ఇలా తడబడుతుండగానే కీమర్ రోచ్ వేసిన ఇన్‌స్వింగర్‌కు గిల్ బోల్తా కొట్టాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఇలా గిల్ పేలవ ఫామ్ కనబర్చడంతో చాలా మంది ఫ్యాన్స్ అతన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. పూర్తి బ్యాటింగ్ పిచ్‌లపై చెలరేగే గిల్.. పిచ్ నుంచి బౌలర్లకు ఏమాత్రం సహకారం అందినా ఇలాగే సింగిల్ డిజిట్‌ స్కోర్లే చేస్తాడంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరేమో ఇక ప్రిన్స్ పని అయిపోయిందంటూ జోకులు పేలుస్తున్నారు. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు బ్యాటింగ్ చేసే అవకాశాలు తక్కువే.

కాబట్టి ఆ తర్వాత జరిగే వన్డే సిరీసులో అయినా గిల్ జాగ్రత్తగా ఆడి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మంచిది. లేదంటే వరల్డ్ కప్ ముందు భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే. ఫ్యాన్స్ కూడా గిల్ మళ్లీ ఫామ్ అందుకోవాలనే కోరుకుంటున్నారు. మరి అతను ఎలా రాణిస్తాడో చూడాలి.

Story first published: Friday, July 21, 2023, 14:09 [IST]
Other articles published on Jul 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+