విండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెలరేగాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి టీమిండియాకు అదిరే ఆరంభం అందించాడు. అసలు వీళ్లిద్దరూ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ చివర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్ అవుటయ్యాడు.
అయితే తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో గిల్ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్‌తో తన ఆట గురించి గిల్ మాట్లాడాడు. తొలి మూడు మ్యాచుల్లో గిల్ తేలిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు వన్డే, టెస్టు సిరీసుల్లో కూడా గిల్ రాణించలేదు. ఈ ఫేజ్ గురించి గిల్ తన మనసులో మాటను బయటపెట్టాడు.

'పరుగులు చేయడం కష్టంగా మారినప్పుడు.. బేసిక్స్‌పై బాగా ఫోకస్ పెట్టాలి. అదే సమయంలో మనం ఏమైనా తప్పులు చేశామా? అని ఆలోచించుకోవాలి. నేను మొదటి మూడు మ్యాచుల్లో పెద్దగా తప్పులు చేశానని అనుకోవడం లేదు. కాకపోతే కొన్నిసార్లు మనం ఆడిన మంచి షాట్ కూడా నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్తుంది' అని గిల్ వివరించాడు.
'ఇలాంటి సమయంలో మరీ ఎక్కువ ఆలోచించకూడదు. ఎందుకంటే మనం బాగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అప్పుడే అసలు మనకు ఏది వర్కవుట్ అయిదో గుర్తుతెచ్చుకోవాలి. దాన్నే అనుసరించాలి' అని గిల్ చెప్పుకొచ్చాడు. నాలుగో టీ20లో క్రీజులో కుదురుకున్న తర్వాత గిల్ చెలరేగాడు.
'మొదటి మూడు మ్యాచుల్లో నేను కనీసం 10 పరుగుల మార్కు కూడా దాటలేకపోయా. ఇక్కడ వికెట్ చాలా బాగుంది. అందుకే నాకు దక్కిన ఆరంభాన్ని అవకాశంగా మార్చుకోవాలని అనుకున్నా. మంచి పవర్‌ప్లే దక్కింది. అప్పుడే అనుకున్నాం.. మేమిద్దరం మరో 4-5 ఓవర్లు ఆడితే మ్యాచ్ ఈజీగా ముగిసిపోతుందని' అని వెల్లడించాడు. అనుకున్నట్లే వీళ్లిద్దరే టీమిండియాను గెలిపించినంత పనిచేశారు.