Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజూకు మళ్ళీ మొండి చెయ్యే?.. కిషన్ వైపే రోహిత్ మొగ్గు!

వెస్టిండీస్ పై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టు వన్డేలకు సిద్ధమైంది. ఈ రెండు జట్లు మూడు వన్డేల్లో తలపడతాయి. ఆగస్టు 1వ తేదీన చివరి వన్డే జరుగుతుంది. ఈ సిరేసులో భారత జట్టు ఎంపికలో ఒక పెద్ద డిబేట్ మొదలైంది. ఈ టీంలో వికెట్ కీపర్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు? అనేది పెద్ద సమస్యగా మారింది. రిషభ్ పంత్ ఉండగా అసలు ఈ సమస్య లేదు.

అతనే టీమ్ మేనేజ్ మెంట్ మొదటి చాయిస్ కీపర్. అతను లేకపోవడంతో ఈ బాధ్యతలు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పై పడ్డాయి. అదే సమయంలో మరో యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ కూడా గాయపడ్డాడు. దీంతో రాహుల్, ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా రాహుల్ కూడా గాయపడ్డాడు.

INDvsWI Sanju Samson or Ishan Kishan Will Rohit ignore Sanju once again

ఆ తర్వాత టెస్టులు మాత్రమే జరగడంతో కేఎస్ భరత్ ఎక్కువగా ఈ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు ఐపీఎల్ తర్వాత తొలిసారి టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీసుకు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఎంపికయ్యారు. వీరిలో కిషన్ సాధారణంగా ఓపెనర్ గా వస్తాడు. రెండు, మూడు సార్లు మిడిల్ ఆర్డర్ లో అవకాశం ఇచ్చినా ఫెయిలయ్యాడు. దీంతో సంజూకు ఈ సిరీసు తొలి మ్యాచులో అవకాశం దక్కొచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

సంజూ సాధారణంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావడం, ఇంతకుముందు వచ్చిన అవకాశాల్లో రాణించడం అతనికు పెద్ద ప్లస్. కానీ ఇటీవల జరిగిన రెండో టెస్టులో కిషన్ చెలరేగాడు. తను మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడగలను అని నిరూపించాడు. దానికి తోడు అంతకుముందు వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం కూడా కిషన్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది.

అయితే పూర్తిగా వికెట్ కీపింగ్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్కిల్స్ మాత్రమే చూస్తే.. సంజూకు అవకాశం ఇవ్వాలి. కానీ గతంలో చాలాసార్లు ఇలాంటి సందర్భాల్లో సంజూకు మేనేజ్ మెంట్ మొండి చెయ్యి చూపింది. కాబట్టి ఈ తొలి వన్డేలో కూడా కిషన్ కే ఆడే అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదు.

Story first published: Thursday, July 27, 2023, 14:31 [IST]
Other articles published on Jul 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+