Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజూ పర్‌ఫెక్ట్ టీం ప్లేయర్.. సూర్య ప్లేస్‌లో పంపితే చెలరేగాడు.. మాజీ లెజెండ్ ప్రశంసలు!

విండీస్‌తో మూడో వన్డేలో తనకు దక్కిన అవకాశాన్ని టీమిండియా యువ స్టార్ కేరళ సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన అతను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మాజీలు, ఫ్యాన్స్ అందరూ అతని ఆటతీరును మెచ్చుకుంటున్నారు.

ఈ జాబితాలో టీమిండియా మాజీ లెజెండ్ సాబా కరీం కూడా చేరాడు. శాంసన్‌కు ఆశించినన్ని అవకాశాలు దక్కకపోయినా.. వచ్చిన ఛాన్సులను అతను చక్కగా యూజ్ చేసుకుంటున్నాడని కొనియాడాడు. తనలోని సత్తాను అందరికీ చూపించే ప్రయత్నం చేశాడని మెచ్చుకున్నాడు. శాంసన్ ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని, తనో గిఫ్టెడ్ ప్లేయర్ అని కొనియాడాడు.

 INDvsWI Sanju Samson is a perfect team man says legend

'సంజూను అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. తను చాలా ట్యాలెంటెడ్ ప్లేయర్. మూడో వన్డేలో తన ఇన్నింగ్స్ ఒక ఫ్రెష్ ఎయిర్‌లా అనిపించింది. మైదానంలోకి దిగినప్పటి నుంచే ఎగ్రెసివ్‌గా ఆడాలనేదే తన లక్ష్యం అని చెప్పాడు. ఆ సమయంలో చక్కగా బౌలింగ్ చేస్తున్న లెగ్ స్పిన్నర్లను శాంసన్ ఎదుర్కొన్న తీరు సూపర్. ఇది కదా సంజూ సత్తా' అని కరీం అన్నాడు.

'సంజూకు వరుస అవకాశాలు ఇవ్వడం లేదు. రెగ్యులర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చినప్పుడే సంజూకు ఛాన్సులు వచ్చాయి. అతనికి ఇప్పటి వరకు ఈజీ జర్నీ కాదు. అయినా సరే సంజూ మాత్రం తన ఛాన్సుల్లో చెలరేగడానికే చూస్తున్నాడు. తనను ఏ స్థానంలో ఆడేందుకు పంపినా రెడీగా ఉన్నాడు. సంజూ పర్‌‌ఫెక్ట్ టీం మ్యాన్' అని అన్నాడు.

'వన్డేల్లో సంజూకు ఇంత గుర్తింపు రావడం నిరంతరం పోరాడినందుకు దక్కిన ఫలితం అని చెప్పొచ్చు. శ్రేయాస్ లేని సమయంలో భారత్ వద్ద సంజూ, సూర్య రెండు ఆప్షన్లు ఉన్నాయి. వీరిద్దరి పాత్రలు రివర్స్ చేశారు. సూర్యకు బదులు సంజూను నాలుగో స్థానంలో పంపడంతో.. అతను ఈ పాత్రకు న్యాయం చేశాడు' అని మెచ్చుకున్నాడు.

Story first published: Thursday, August 3, 2023, 7:14 [IST]
Other articles published on Aug 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+