Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI : సంజూ, కిషన్.. తొలి టీ20 ఆడేది ఎవరు?.. మాజీ లెజెండ్ ఎవరిని పిక్ చేసుకున్నాడంటే?

విండీస్‌పై వన్డే సిరీస్ నెగ్గిన భారత జట్టు.. ఐదు టీ20ల సిరీస్ కోసం రెడీ అయింది. ఈ క్రమంలో గురువారం నాడు తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఎవర్ని తీసుకుంటారని తెగ చర్చ జరుగుతోంది. దీనిపై మాజీ లెజెండ్ వసీం జాఫర్ స్పందించాడు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఇద్దరిలో ఎవర్ని ఆడించాలనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

విండీస్ టూర్‌లో కిషన్ అద్భుతంగా రాణించాడు. మూడు వనడేలు ఆడిన అతను మూడింట్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా అందుకున్నాడు. అదే సమయంలో మూడో వన్డేలో సంజూ శాంసన్ కూడా చెలరేగాడు. ఎగ్రెసివ్ షాట్లతో మూడో వన్డేలో హాఫ్ సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే తొలి టీ20లో వీళ్లిద్దరిలో ఎవర్ని ఆడించాలని చర్చ జరుగుతోంది.

 Ishan Kishan Sanju Samson

దీనిపై సమాధానం ఇచ్చిన జాఫర్.. 'నేనైతే ఇద్దర్నీ ఆడిస్తా. ఇది వాళ్ల ఫార్మాట్. కిషన్ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. ఇక సంజూ ఈ ఫార్మాట్‌లో చాలా ఎగ్జయిటింగ్ ప్లేయర్. ఇద్దర్నీ ఆడించడానికి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా.. అదే చేయాలని చెప్తా' అని తెలిపాడు.

ఇప్పటి వరకు భారత్ తరఫున కిషన్ 27 టీ20లు ఆడాడు. వీటిలో 25.11 సగటుతో 653 పరుగులు చేశాడు. అదే సమయంలో సంజూ శాంసన్ కేవలం 17 టీ20లు ఆడాడు. వీటిలో 20.06 సగటుతో 301 రన్స్ చేశాడు. అయితే సంజూ స్ట్రైక్ రేటు (133.77).. కిషన్ (122.74) కన్నా ఎక్కువ కావడం గమనార్హం. పొట్టి ఫార్మాట్‌లో స్ట్రైక్ రేట్ చాలా కీలకం కాబట్టి సంజూనే ఆడించొచ్చు.

ఇక బౌలర్ల విషయానికి వస్తే.. మొదటి పేసర్ స్థానాన్ని అర్షదీప్ సింగ్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండో పేసర్ ప్లేస్ కోసం ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫామ్ బట్టి చూస్తే ముఖేష్‌కు అవకాశం దక్కొచ్చని జాఫర్ అభిప్రాయపడ్డాడు. వన్డే సిరీసులో అతను రాణించాడు కాబట్టి.. మొదటి టీ20లో అతనికే మేనేజ్‌మెంట్ ఓటు వేసే అవకాశం ఉందన్నాడు.

Story first published: Thursday, August 3, 2023, 16:09 [IST]
Other articles published on Aug 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+