Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.. ఎమోషనల్ అయిపోయిన విండీస్ కెప్టెన్!

చివరిదైన ఐదో టీ20లో భారత్‌ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్.. ఐదు మ్యాచుల సిరీసును 3-2 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది. ఇలా టీమిండియాపై టీ20 సిరీస్ గెలవడం వెస్టిండీస్‌కు 17 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. లాడర్‌హిల్ వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో భారత జట్టు చాలా పేలవమైన ప్రదర్శన చేసింది.

ఇలా టీమిండియాపై అనూహ్య విజయం సాధించడంపై విండీస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇది మాకు చాలా పెద్ద సిరీస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాను మా సొంత గడ్డపై ఓడించడం మాకు చాగా అంటే చాలా గొప్ప విషయం' అని చెప్పాడు.

INDvsWI

'లాస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాత రాత్రంతా కూర్చొని మాట్లాడుకున్నాం. ఈ టీం సిరీస్ గెలిచిందని మాకు గుర్తింపు రావడం కోసం మేం ఆడటం లేదు. మా ప్రజల కోసం ఆడుతున్నాం. కోచింగ్ సిబ్బంది, చైర్మన్‌కు కూడా ఈ విజయంలో క్రెడిట్ ఉంది. లాస్ట్ ఓటమి తర్వాత టెన్షన్ పడిపోవాల్సింది. కానీ వాళ్లు నన్ను కూర్చోపెట్టి చక్కగా మాట్లాడారు' అని వెల్లడించాడు.

'ఇక్కడి నుంచి ఎటు వెళ్లాలని మాట్లాడుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలే జట్టును ఆదుకుంటాయని నేను నమ్ముతా. పూరన్ ఈ విషయంలో చాలా పెద్ద పెర్ఫామర్. ఐదు మ్యాచుల్లో మూడింట్లో బాగా ఆడాలని అతన్ని అడిగాం. అలాగే మా బౌలింగ్ యూనిట్‌ను కూడా మెచ్చుకోవాలి. బలమైన బ్యాటింగ్ ఉన్న టీమిండియాను వాళ్లు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు' అని పావెల్ చెప్పాడు.

'ఇక మా ఫ్యాన్స్ మద్దతును కూడా మర్చిపోకూడదు. ఓడిపోయేలా ఉన్నా కూడా వాళ్లు మాపై నమ్మకం ఉంచి మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో కూడా అండగా నిలబడ్డారు. ఇదంతా చూస్తుంటే క్రికెట్ ఎంత ప్రభావంచ చూపుతుందో తెలుస్తోంది. అంటే మేం ఈ ఆటతో కరీబియన్ ప్రజలను సంతోషపెట్టొచ్చు అన్నమాట' అని పావెల్ తెలిపాడు.

Story first published: Monday, August 14, 2023, 10:36 [IST]
Other articles published on Aug 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+