Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్ ముందడుగు.. అశ్విన్, జడ్డూ అగ్రస్థానంలోనే!

విండీస్‌తో తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన స్థానం మెరుగు పరుచుకున్నాడు. ఈ శతకంతో అతను టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలోకి దూసుకొచ్చాడు. డొమినికా వేదికగా జరిగిన టెస్టులో అతను చేసిన శతకం.. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతనికి పదవ సెంచరీ. దీంతో అంతకుముందు 13వ ర్యాంకులో ఉన్న రోహిత్.. తాజా ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక చివరగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో నిలిచిన ఏకైక భారతీయ బ్యాటర్ రిషభ్ పంత్.. తన స్థానం కోల్పోయాడు. అతను ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోయాడు. అరంగేట్రంలో అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. 73వ ర్యాంకులో ఈ జాబితాలో చేరాడు. ఈ టెస్టులో బంతితో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా తన స్థానాని కాపాడుకున్నాడు.

Team India captain Rohit Sharma entered top ten test batters

ప్రస్తుతం అతను 884 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న ప్యాట్ కమిన్స్ కేవలం 828 పాయింట్లతోనే ఉండటం గమనార్హం. డొమినికా టెస్టులో ఫర్వాలేదనిపించిన రవీంద్ర జడేజా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకిన అతను 779 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఏడాదికిపైగా ఆటకు దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా పదో స్థానంలో ఉన్నాడు.

అదే సమయంలో ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 449 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఆల్‌రౌండర్ల జాబితాలో 362 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో ఇండియన్ ప్లేయర్ అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక డొమినికా టెస్టులో హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించిన విరాట్ కోహ్లీ 14వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Wednesday, July 19, 2023, 16:00 [IST]
Other articles published on Jul 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+