వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు కోహ్లీ అవుటైన కాసేపటికే డిక్లేర్ చేయాలని అనుకుందట. కానీ ఒక్క ప్లేయర్ కోసం రోహిత్ ఈ నిర్ణయాన్ని వెల్లడించకుండా వెయిట్ చేశాడట. అతనెవరో కాదు.. ఇదే మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్. కోహ్లీ అవుటైన తర్వాత కిషన్ క్రీజులోకి వచ్చాడు. అతను తొలి పరుగులు చేయడానికి కూడా 20 బంతులు ఎదుర్కొన్నాడు.
బ్యాటుతో ఈ మ్యాచ్‌లో కిషన్ చేయడానికి పెద్దగా ఏం మిగల్లేదు. అయితే వికెట్ల వెనుక కిషన్ ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలోనే అతను బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో రోహిత్.. ఒక హింట్ ఇచ్చాడట. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కిషన్..19 బంతులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన తొలి పరుగులు చేయడానికి అతను 20 బంతులు తీసుకున్నాడు. ఆ బంతికి కిషన్ సింగల్ తీయగానే తాము డిక్లేర్ చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ ముందుగానే హింట్ ఇచ్చాడట.

ఈ క్రమంలోనే కిషన్‌కు తను ఏం చెప్పానో రోహిత్ వెల్లడించాడు. 'మా బ్యాటర్లతో నేను మాట్లాడా. ఒకటి రెండు ఓవర్లలో డిక్లేర్ చేస్తామని చెప్పా. ఇక కిషన్ ఒక్క పరుగు కూడా చెయ్యకుండా 15-20 బంతులు ఆడటంతో అసలు విషయం చెప్పా. నువ్వు తొలి పరుగులు చేస్తే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాం. టెస్టు క్రికెట్‌లో నీ ఫస్ట్ రన్స్ తెచ్చుకున్న తర్వాతనే డిక్లేర్ చేస్తామని కిషన్‌కు చెప్పాం' అని రోహిత్ చెప్పాడు.
'తొలి టెస్టు మ్యాచ్ ఆడే సమయంలో రిలాక్స్‌డ్‌గా ఆడటం చాలా ముఖ్యం. దానికితోడు రెండో ఆట మొత్తంలో కిషన్ కేవలం డ్రెస్సింగ్ రూంలో ఒంటరికిా కూర్చొని ఉన్నాడు. ఛాన్స్ దొరకితే బ్యాటింగ్ చేద్దామని అనుకుంటూ ఉండి ఉంటాడు. ఆ ఫీలింగ్ నాక్కూడా బాగా తెలుసు. అందుకే నువ్వు పరుగులు చేయగానే డిక్లేర్ చేస్తామనే మెసేజ్‌ను తనకు స్పష్టంగా తెలిసేలా చేశా' అని రోహిత్ తెలిపాడు.