వెస్టిండీస్‌తో టూర్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా ప్లేయర్లకు మంచి విశ్రాంతి దొరికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ తన సెలవులను పారిస్‌లో ఎంజాయ్ చేశాడు. అనంతరం కొన్నిరోజుల క్రితం వెస్టిండీస్‌కు చేరుకున్నాడు. ఇక్కడ కూడా తన లీవ్స్‌లో మంచి టూరిస్ట్ స్పాట్‌లు తిరుగుతున్నాడు.
కరీబియన్ బీచ్‌లో తను ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నాడు రోహిత్. ఈ నెల 12 నుంచి వెస్టిండీస్‌తో భారత్ తొలి టెస్టు ఆడుతుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుందీ జట్టు. ఇటీవలే దీని కోసం భారత జట్టు విండీస్ చేరుకుంది. ఇక్కడ ఒక వారంపాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత.. విండీస్‌తో తొలి టెస్టు ఆడుతుంది.

రోహిత్ చివరగా డబ్యూటీసీ ఫైనల్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను అటు బ్యాటుతో, ఇటు కెప్టెన్సీలో పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాటుతో అతని టాప్ స్కోరు 43 పరుగులే. ఇక టాస్ గెలిచిన తర్వాత అతను ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం ఎంతటి వివాదాస్పదం అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అశ్విన్‌ను పక్కన పెట్టడంపై కూడా రోహిత్‌ను చాలా మంది తిట్టిపోశారు.
ఇక విండీస్‌కు భారత బృందం మొత్తాన్ని ఒకేసారి పంపడం బీసీసీఐకి కుదరలేదు. దీంతో ముందుగా ఒక బ్యాచ్‌ను పంపింది. ఆ తర్వాత బరో బ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులు విండీస్ చేరుకున్నారు. ఈ సిరీస్‌లో ఛటేశ్వర్ పుజారాను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అదే సమయంలో మహమ్మద్ షమీ కొంత విశ్రాంతి కోరడంతో అతనికి కూడా రెస్ట్ ఇచ్చేశారు. పుజారా స్థానంలో జైస్వాల్, గైక్వాడ్ ఇద్దరిలో ఒకరు ఆడే అవకాశం ఉంది.