Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma : అలా అవుటైనందుకు చాలా బాధపడ్డా.. సెంచరీ చేసినా హ్యాపీగా లేని రోహిత్!

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 229 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 103 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే దీన్ని మరింత భారీ స్కోరుగా మలుస్తాడని అనుకున్న ఫ్యాన్స్ మాత్రం కొంత నిరుత్సాహపడ్డారు.

ఇదే విషయాన్ని రోహిత్ కూడా ఒప్పుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అవుటైనప్పుడే రోహిత్ చాలా డిసప్పాయింట్ అయినట్లు అతను మొఖం చూస్తేనే అర్థం అవుతుంది. అవుటైన తర్వాత చాలా చికాకుగా పెవిలియన్ వైపు వెళ్లాడీ స్టార్. దీని గురించి తాజాగా మాట్లాడిన అతను.. 'మనం ఎప్పుడు అవుటైనా డిసప్పాయింట్ అవడం సహజం. నేను ఆ టెస్టులో అవుటైనప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యా' అని చెప్పాడు.

INDvsWI Rohit Sharma disappointed even after smashing a century

'నేను అప్పుడు బాగా బ్యాటింగ్ చేస్తున్నా. నా కాన్సన్‌ట్రేషన్ చాలా బాగుంది. భారీ స్కోరు చేయడానికి అది సరైన టైం. అలాంటి టైంలో అవుటైనందుకు చాలా బాధపడ్డా. కానీ ప్రస్తుతం నా ఫోకస్ మాత్రం భవిష్యత్తులో ఏం చేయగలను? అనే. ఇకపై అలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచిస్తున్నా. ఆ అవుట్ గురించి ఆలోచించడం లేదు' అని రోహిత్ స్పష్టం చేశాడు.

గురువారం నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఈ రెండు టీమ్స్ మధ్య రెండో టెస్టు మొదలవుతుంది. ఇది భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే 100వ టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ కచ్చితంగా బడా వేదిక అని రోహిత్ అన్నాడు. 'ఈ రెండు టీమ్స్ మధ్య చాలా చరిత్ర ఉంది. నేను పుట్టక ముందు నుంచి ఇది కొనసాగుతోంది. ఈ మ్యాచ్ కూడా అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, July 19, 2023, 10:20 [IST]
Other articles published on Jul 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+