Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WIvsIND : రోహిత్ సెంచరీ.. ఎక్కడా ఆగని జైస్వాల్.. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న టీమిండియా!

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కుర్రాడు యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించిన అతను.. రోహిత్ అవుటైన తర్వాత కూడా తన ఆటలో ఎలాంటి తడబాటు కనిపించనివ్వలేదు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేసుకున్న అతను.. భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్నాడు.

ఓవర్‌నైట్ స్కోరు 80/0తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు అద్భుతంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే సెంచరీ పూర్తవగానే అతను పెవిలియ్ చేరాడు. విండీస్ అరంగేట్ర కుర్రాడు ఆథనైజ్ బౌలింగ్‌లో రోహిత్ తడబడ్డాడు. హిట్‌మ్యాన్ అవుటైన వెంటనే శుభ్‌మన్ గిల్ (6) కూడా అతని వెనుకే పరుగు తీశాడు.

Rohit Sharma Yashasvi Jaiswal

రోహిత్, గిల్ అవుటవడంతో జైస్వాల్‌కు విరాట్ కోహ్లీ (36 నాటౌట్) అండగా నిలిచాడు. తనదైన స్టైల్‌లో ఆడుతున్న అతను జైస్వాల్‌కు కూడా ఆడే ఈ క్రమంలోనే అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. భారీ స్కోరు దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు కేవలం 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ 143 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ కూడా తనదైన స్టైల్‌లో ఆడుతున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లోనే భారత జట్టు భారీ స్కోరు చేసి విండీస్ ముందు ఊహించనంత పెద్ద లక్ష్యాన్ని ఉంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. భారత్ తరఫున అరంగేట్రంలో అత్యథిక స్కోరు చేసిన వారి జాబితాలో చేరేందుకు జైస్వాల్ తపన పడుతున్నట్లు కనిపిస్తోంది.

జైస్వాల్‌తోపాటు రోహిత్ కూడా అద్భుతంగా రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌పై సెంచరీ బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మళ్లీ ఇప్పుడు సెంచరీ బాదినందుకు అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఇక జైస్వాల్ ఎంత స్కోరు కొడతాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.

Story first published: Friday, July 14, 2023, 7:00 [IST]
Other articles published on Jul 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+