వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఐపీఎల్ సంచలనం రింకూ సింగ్ కూడా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అతను ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అతన్ని టీ20 జట్టులోకి తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. సెలెక్టర్లు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రింకూ తన కుటుంబం, పేదరికం వల్ల ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆడాలని తనుకు ఉన్నా కూడా కుటుంబ పరిస్థితుల వల్ల ఎక్కువ కాలం ఆడలేకపోయానని రింకూ అన్నాడు. ఇలాంటి సమయంలో కొంత కాలం క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశానన్నాడు.

ఆ సమయంలో తనకు స్వీపర్‌గా, ఒక ఇంట్లో పని దొరికిందని తెలిపాడు. కానీ అది చేయలేక మళ్లీ క్రికెట్‌కు వచ్చినట్లు గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో తన తల్లిదండ్రులు చాలా మద్దతిచ్చారని వెల్లడించాడు. వాళ్లు తన కోసం ఎన్న త్యాగాలు చేశారని, అందుకే తనకు ఇప్పుడు ఇంత గుర్తింపు దక్కిందని చెప్పాడు. ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబానికి అతను అండగా నిలిచాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టుతో కలిసినప్పుడు అతన్ని రూ.80 లక్షలకు ఆ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.
అప్పటి నుంచి అదే టీంతో ఉన్న రింకూ.. గతేడాది నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది కేకేఆర్ సాధించిన దాదాపు అన్ని విజయాల్లో రింకూ పాత్ర ఉందనడం అతిశయోక్తి కాదు. రింకూ వల్ల అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగైంది. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన రింకూ.. టీమిండియా తలుపు తట్టేందుకు రెడీ అయ్యాడు.