Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI : పూనకం వచ్చిన వాడిలా చెలరేగిన అశ్విన్.. తల్లడిల్లిపోయిన వెస్టిండీస్.. స్కోరు ఎంతంటే?

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు. ఏకంగా ఐదు వికెట్లతో అదరగొట్టాడు. అతను విజృంభించడంతో వెస్టిండీస్ టీం తేలిపోయింది. అతనితోపాటు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ కూడా తలో చెయ్యి వేయడంతో విండీస్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. ఈ క్రమంలో విండీస్ జట్టు కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది.

డొమినికా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ కుర్ర బ్యాట్ టిగనరైన్ చందర్‌పాల్ (12)ను అశ్విన్ చాలా త్వరగా భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఈ జోరు తగ్గించంతో టీమిండియా బౌలర్లు చెలరేగారు. పిచ్ నుంచి వస్తున్న సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న అశ్విన్, జడేజా ఈ సినిమాలకు వెస్టిండీస్ వెటరన్లు ఇద్దరూ అద్భుతంగా చెలరేగారు.

INDvsWI

వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వెసస్టంబీ తొలి మ్యాచ్ దారుణంగా ఓడిపోయేలా ఉంది. ఎందుకంటే అశ్విన్, జడ్డూ దెబ్బకు ఆ టీం తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ అయింది. బదులుగా భారత జట్టు ఓపెనర్లు తొలి రోజు చెలరేగారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ (40 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అతనికి రోహిత్ శర్మ (30 నాటౌట్) మంచి సహకారం అందించాడు.

జైస్వాల్ తన ఇన్నింగ్స్‌లో ఆరు బౌండరీలు బాదడం గమనార్హం. అతను చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఇక రోహిత్ కూడా మంచి టచ్‌లో ఉన్నట్లే కనిపించాడు. ఇదంతా చూస్తే తొలి టెస్టులో భారత జట్టు ఘనవిజయం సాధించడం గ్యారంటీలా కనిపిస్తోంది. అయితే బౌలర్లకు మంచి సహకారం అందజేస్తున్న విండ్‌సోర్ పార్క్‌లో భారత బ్యాటర్లు ఈ రేంజ్‌లో చెలరేగడం చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఇలాగైతే టీమిండియా భారీ స్కోరు చేయడం గ్యారంటీ అంటున్నాడు.

Story first published: Thursday, July 13, 2023, 7:28 [IST]
Other articles published on Jul 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+