Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: మా ఓటమికి కారణం అదే.. ఆ డిపార్ట్‌మెంట్ అంతా ఫెయిలైంది: ద్రావిడ్

భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్ తన ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల తర్వా భారత్‌పై విండీస్ ఒక సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాదు, భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఒక ద్వైపాక్షిక సిరీసులో మూడు మ్యాచులు ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61) మినహా అంతా విఫలమయ్యారు.

ఇక ఛేజింగ్‌లో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ (85 నాటౌట్), నికోలస్ పూరన్ (47) రాణించారు. చివర్లో షాయి హోప్ (22 నాటౌట్) రాణించారు. దీంతో భారత్ నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్‌ను విండీస్ కేవలం 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-2తో తమ ఖాతాలో వేసుకుంది.

INDvsWI:

ఈ ఓటమి గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఈ సిరీసులో భారత జట్టు కొన్ని పొరపాట్లు చేసిందని, ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో చేసిన తప్పులే కొంప ముంచాయని చెప్పాడు. ఆరంభంలో రెండు ఓటముల నుంచి పుంజుకోవడంలో జట్టు సక్సెస్ అయిందని, కానీ సిరీస్‌ను అదే ఊపులో ముగించలేకపోయామని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.

'సిరీసులో మేం కొన్ని పొరపాట్లు చేశాం. ఓవరాల్‌గా ఐదు మ్యాచులు గమనిస్తే మేం చేసిన తప్పులు కనిపిస్తాయి. మొదటి రెండు మ్యాచులు, ఈ చివరి మ్యాచులో కూడా మా బ్యాటింగ్ విభాగం అంత గొప్పగా రాణించలేదు. కానీ ఇది యంగ్ టీం కాబట్టి అలా జరగడంలో వింతేం లేదు. అందరూ కుర్రాళ్లు, నెమ్మదిగా మెరుగవుతున్నారు' అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

'ఇది ఎదుగుతున్న టీం కాబట్టి ఎత్తుపల్లాలు సహజమే. అదే సమయంలో విండీస్ పెట్టిన ఎఫర్ట్‌ని మర్చిపోకూడదు. వాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ సిరీసులో మేం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓడిపోయినందుకు బాధగానే ఉంది. రెండు ఓటముల నుంచి కోలుకొని రాణించడం గొప్పే. కానీ ఈ మ్యాచ్ కూడా గెలిస్తే బాగుండేది. విండీస్ చాలా మంచి టీ20 జట్టు' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

Story first published: Monday, August 14, 2023, 16:58 [IST]
Other articles published on Aug 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+