వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం తడబడింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మినహా.. మిగతా ఎవరూ కూడా కమాండింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తన అంతర్జాతీయ కెరీర్‌ను మెరుపులతో మొదలు పెట్టిన తిలక్.. తను ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు.
ఈ మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా ఇంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే మాజీ లెజెండ్ వసీం జాఫర్ ఈ తెలుగు కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అదేదో క్లబ్ మ్యాచో, స్టేట్ మ్యాచో ఆడినట్లు దంచికొట్టాడని మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా కూడా తిలక్ తన మార్క్ చూపించాడని అన్నాడు.

'తిలక్ చాలా ఇంప్రెసివ్‌గా కనిపించాడు. ఏమాత్రం టెన్షన్ పడలేదు. తన బ్యాటింగ్ మొదలు పెట్టిన తీరు చూస్తే.. అదేదో క్లబ్ మ్యాచ్ ఆడుతున్నట్లు మొదలు పెట్టాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తన సత్తాను నమ్ముకున్నాడు. అదే అతని ఆటలో మంచి విషయం అని చెప్పాలి' అని జాఫర్ చెప్పాడు.
'తిలక్ ఇలా ఆడటం.. అతను మెంటల్‌గా ఎంత బలంగా ఉన్నాడో ఇది చూపిస్తుంది. ఈ పిచ్‌పై అంత కంఫర్టబుల్‌గా ఆడిన ఒకే ఒక్క బ్యాటర్ తిలక్. మిగతా వాళ్లంతా చాలా ఇబ్బంది పడ్డారు. తిలక్ ఆడిన షాట్స్ చూస్తే.. తను ఎంత మంచి ఫామ్‌లో ఉన్నాడో అర్థం అవుతుంది. ఇంకాసేపు ఆడి ఉంటే.. టీమిండియాను తిలక్ గెలిపించేవాడు' అన్నాడు.
'తిలక్ ఇంకో 20 పరుగులు చేయాల్సింది. అలా చేయనందుకు చాలా డిసప్పాయింట్ అయ్యుంటాడీ కుర్రాడు. తిలక్ కనుక 50 లేదా 60 పరుగులు చేసి ఉంటే.. ఇండియా ఈజీగా గెలిచేది. సంజూ శాంసన్ రనౌట్ కూడా ఈ ఓటమిపై ప్రభావం చూపింది. శాంసన్ కూడా మంచి టచ్‌లో కనిపించాడు' అని జాఫర్ అభిప్రాయపడ్డాడు.