Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: పాపం పూరన్.. కమిలిపోయింది!

క్రికెట్ అంటే ఎప్పుడూ సెంచరీలు, వికెట్లు, ఫోర్లు, సిక్సులే కాదు. ఎక్కువగా గాయాలే ఉంటాయి. ఈ విషయంలో బడా బడా స్టార్ ప్లేయర్లు కూడా మినహాయింపేమీ కాదు. వాళ్లకు కూడా మైదానంలో దెబ్బలు తగులుతూనే ఉంటాయి. తాజాగా ఈ విషయాన్ని విండీస్ స్టార్ నికోలస్ పూరన్ మరోసారి నిరూపించాడు.

భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వా భారత్‌పై విండీస్ ఒక సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాదు, భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఒక ద్వైపాక్షిక సిరీసులో మూడు మ్యాచులు ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61) మినహా అంతా విఫలమయ్యారు.

INDvsWI:

ఇక ఛేజింగ్‌లో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ (85 నాటౌట్), నికోలస్ పూరన్ (47) రాణించారు. చివర్లో షాయి హోప్ (22 నాటౌట్) రాణించారు. దీంతో భారత్ నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్‌ను విండీస్ కేవలం 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-2తో తమ ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో పూరన్ బ్యాటింగ్ చేసే సమయంలో అతనికి రెండుసార్లు దెబ్బలు తగిలాయి. బ్రాండన్ కింగ్ నేరుగా బాదిన ఒక భారీ షాట్.. నేరుగా వచ్చి పూరన్‌ను తగిలింది. అతని ఎడమ మోచేతి దగ్గర ఈ బంతి దెబ్బ తగిలింది. అలాగే అర్షదీప్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. ఒక బంతి నేరుగా వచ్చి పూరన్ పొట్టపై బలంగా తగిలింది. ఈ రెండూ చూడటానికి పెద్ద దెబ్బల్లా కనిపించలేదు.

కానీ మ్యాచ్ ముగిశాక అవి ఎంత బలంగా తగిలాయో నికోలస్ పూరన్ చూపించాడు. అద్దం ముందు నిలబడి తన దెబ్బలను చూపిస్తూ ఫొటో తీసుకున్నాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దెబ్బలు పూరన్ డెడికేషన్‌కు నిదర్శనం అని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. ఇంత దెబ్బలు తగిలినా జట్టును గెలిపించడానికి పూరన్ పోరాడాడు అంటూ కొనియాడుతున్నారు.

Story first published: Monday, August 14, 2023, 15:24 [IST]
Other articles published on Aug 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+