Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: కోహ్లీ, రోహిత్‌ తిట్లు తప్పవు.. ఈ కష్టం పగవాడికి కూడా వద్దు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వీళ్లిద్దరికీ వెస్టిండీస్ సిరీస్ కత్తి మీద సాము వంటిదని మాజీ దిగ్గజం దీప్ దాస్‌గుప్తా చెప్పాడు. వీళ్లు ఈ సిరీసులో ఆడినా, ఆడకపోయినా విమర్శలపాలు అవడం ఖాయమని అన్నాడు. వీళ్లు ఈ సిరీసులో పరుగులు చేస్తే.. బలహీన జట్టుపై చేశారంటారని, పరుగులు చెయ్యకపోతే విండీస్‌పై కూడా ఆడలేదని తిడతారని దీప్ దాస్‌గుప్తా చెప్పాడు.

రోహిత్, కోహ్లీ రాణించినా రాణించకపోయినా వాళ్లను ఫ్యాన్స్ అంతా నెగిటివ్‌గానే చూస్తారని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయినా సరే చాలా మంది ఫ్యాన్స్‌కు ఇది నచ్చలేదు. రోహిత్‌ను తెగ ట్రోల్ చేశారు. కనీసం వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవ్వలేకపోయిన విండీస్‌పైనే భారీ శతకాలు కొడతారంటే రోహిత్‌ను తిట్టిపోశారు.

kohlirohith

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ పేలవ ప్రదర్శన తర్వాత ఈ సెంచరీ అతని కెరీర్‌కు చాలా ముఖ్యం. దీంతో తను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు రోహిత్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే అతని ఇన్నింగ్స్‌ను దాస్‌గుప్తా మెచ్చుకున్నాడు. అయితే ఈ సిరీస్ వల్ల కోహ్లీ, రోహిత్‌కు ఎలాంటి ఉపయోగం లేదని, ఏం చేసినా విమర్శలు ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడ్డాడు.

'రోహిత్, విరాట్ వంటి వాళ్లకు ఈ సిరీస్ చాలా కష్టం. ఎందుకంటే వీళ్లు ఇక్కడ పరుగులు చేస్తే.. విండీస్ చాలా వీక్ టీం కాబట్టి రన్స్ చేశారని జనాలు అంటారు. ఒక వేళ దురృష్టవశాత్తూ పరుగులు చేయకపోతే.. కనీసం ఇక్కడ కూడా పరుగులు చేయలేవా? ఇంకెక్కడ ఆడతావ్? అంటూ విమర్శలు చేస్తారు. ఇలాంటి ఆర్గ్యుమెంట్లను కోహ్లీ, రోహిత్ ఎలా చూసుకున్నా గెలవలేరు. అయినా సరే రోహిత్ చాలా అద్భుతంగా ఆడాడు. కష్టపడ్డాడు' అని దాస్‌గుప్తా స్పష్టం చేశాడు.

Story first published: Friday, July 14, 2023, 17:51 [IST]
Other articles published on Jul 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+