Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: స్టన్నింగ్ క్యాచ్.. ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ను మార్చేసిన కుల్దీప్..!

విండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌కు స్పిన్నర్లు మంచి బ్రేక్ త్రూ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు మంచి ఆరంభమే లభించింది. బ్రాండన్ కింగ్ (42), కైల్ మేయర్స్ (25) నిలకడగా రాణించారు. అనవసరమైన షాట్లు ఆడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు.

ఈ క్రమంలో 8వ ఓవర్లో బంతి అందుకున్న అక్షర్ పటేల్.. భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కైల్ మేయర్స్.. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ వద్ద అర్షదీప్‌కు చిక్కాడు. ఆ తర్వాత మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్‌ వేరియేషన్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు.

Kuldeep Yadav

మేయర్స్ అవుటైన తర్వాత వచ్చిన జాన్సన్ చార్లెస్ (12)ను కుల్దీప్ మొదటగా బుట్టలో వేసుకున్నాడు. ఫుల్‌ లెంగ్త్‌లో వేసిన బంతిని స్లాగ్ స్వీప్ ఆడేందుకు చార్లెస్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని బ్యాటును మిస్ అయిన బంతి.. చార్లెస్ ప్యాడ్లను తాకింది. టీమిండియా అప్పీల్ చేయగా అంపైర్ స్పందించలేదు.

కుల్దీప్ మాత్రం ఇది అవుటేనని నమ్మాడు. దీంతో హార్దిక్ రివ్యూ కోరగా.. అది అవుటని తేలింది. ఇక ఆ తర్వాత నికోలస్ పూరన్ (20), బ్రాండన్ కింగ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని విడగొట్టేందుకు మళ్లీ కుల్దీప్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. 15వ ఓవర్లో బంతి అందుకున్న కుల్దీప్.. తన తొలి బంతికే క్రీజులో నిలదొక్కుకున్న పూరన్‌ను అవుట్ చేశాడు.

కుల్దీప్ వేసిన బంతిని ముందుకు వచ్చి భారీ షాట్ ఆడేందుకు పూరన్ ప్రయత్నించాడు. అయితే అతని బ్యాటును మిస్ అయిన బంతి కీపర్ శాంసన్ చేతుల్లో పడింది. అతను క్షణం కూడా వేస్ట్ చేయకుండా వికెట్లను కూల్చాడు. దీంతో పూరన్ స్టంపౌట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. తొలి రెండు మ్యాచుల్లో చెలరేగిన పూరన్ నిరాశగా వెనుతిరిగాడు.

అదే ఓవర్ చివరి బంతికి కుల్దీప్ మరో వికెట్ తీసుకున్నాడు. క్రీజులో కుదురుకొని హాఫ్ సెంచరీకి చేరువలో నిలిచిన బ్రాండన్ కింగ్‌ను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా కుల్దీప్ వేసిన బంతిని స్ట్రెయిట్‌గా బాదేందుకు కింగ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో గాల్లో తన వైపు దూసుకొచ్చిన బంతిని కుల్దీప్ అద్భుతంగా పట్టేశాడు.

రెండు చేతుల్తో ఈ క్యాచ్‌ను కుల్దీప్ ఒడిసి పట్టేశాడు. ఈ సూపర్ రిటర్న్ క్యాచ్‌తో బ్రాండన్ కింగ్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. కుల్దీప్ వేసిన ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ సడెన్‌గా భారత్ వైపు మొగ్గిందనే చెప్పాలి. ఇద్దరు కీలక బ్యాటర్లను అతను పెవిలియన్ చేర్చాడు.

Story first published: Tuesday, August 8, 2023, 21:43 [IST]
Other articles published on Aug 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+