For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ వన్డే సిరీసులో బద్దలయ్యే రికార్డులు ఇవే.. రెడీ అవుతున్న కోహ్లీ, రోహిత్!

విండీస్ ను టెస్టుల్లో చిత్తు చేసిన భారత జట్టు..వన్డేల్లో కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. ఈ క్రమంలో గురువారం నుంచి ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలు అవుతుంది. బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో పలువురు భారత స్టార్ ఆటగాళ్ళు కొన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.

మోడ్రన్ క్రికెట్ గ్రేట్ గా అందరూ పిలుచుకునే విరాట్ కోహ్లీ.. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటి వరకు అతను ఓవరాల్ గా అన్ని ఫార్మాట్లలో కలిపి 12,898 పరుగులు చేశాడు. మరొక 102 పరుగులు చేస్తే అతను 13 వేల పరుగుల మైలురాయి చేరుకుంటాడు. ఈ ఘనత అందుకున్న అతికొద్ది మంది క్రికెటర్ల జాబితాలో చేరతాడు.

Virat Kohli Rohit Sharma

ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్ లో అతిగొప్ప ఓపెనర్లలో ఒకడు అనడం అతిశయోక్తి కాదు. అతను వన్డే ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 9,825 పరుగులు చేశాడు. ఇప్పుడు విండీస్ సిరీసులో కనుక మరో 175 పరుగులు చేస్తే వన్డేల్లో అతను 10 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన దిగ్గజాల సరసన చేరతాడు.

ఇక స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎలాంటి ప్రత్యర్థికి అయినా ముచ్చెమటలు పట్టించ గల స్పిన్నర్. అతను ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై 41 వన్డే వికెట్లు తీసుకున్నాడు. అతను కనుకనే సీరీసులో మరో మూడు వికెట్లు తీసుకుంటే.. వన్డేల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

ఈ క్రమంలో టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్‌ను(43) జడ్డు అధిగమిస్తాడు. అదే 4 వికెట్లు తీసుకుంటే భారత్, వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. కొన్ని రోజులుగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్న యంగ్ ఓపెనర్ గిల్ కూడా అరుదైన రికార్డుకు అడుగు దూరంలోనే ఉన్నాడు. అతను కనుక ఈ సిరీస్లో 21 పరుగులు చేస్తే కెరీర్లో 2,500 పరుగులు పూర్తి చేసుకుంటాడు.

Story first published: Thursday, July 27, 2023, 16:41 [IST]
Other articles published on Jul 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+