Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: నాపై నమ్మకం ఉంచినందుకు హార్దిక్‌కు చాలా థాంక్స్: జైస్వాల్

వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఒకానొక దశలో ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసేలా కనిపించాడీ యంగ్ స్టార్. కానీ అది జరగలేదు. దీంతో 84 పరుగులతో అజేయంగా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.

ఇలా భారత్‌కు శుభారంభం అందించడం గురించి మ్యాచ్ అనంతరం మాట్లాడిన జైస్వాల్.. 'జట్టుకు ఏం కావాలో చూసి.. దానికి తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నిస్తా. అదే సమయంలో నన్ను నేను ఎక్స్‌ప్రెస్ చేసుకునేలా ఆడతా. ముఖ్యంగా పవర్‌ప్లేలో నాకు ఎన్ని షాట్లు ఆడే అవకాశం వస్తుందో.. అది ముఖ్యం' అని చెప్పాడు.

INDvsWI

'ఇంటెంట్‌తో ఆడుతూ.. అదే సమయంలో సాధ్యమైనంత ఎక్కువ సమయం అదే ఇంటెంట్‌తో ఆడేందుకు ప్రయత్నిస్తా' అని చెప్పిన జైస్వాల్.. తనపై నమ్మకం ఉంచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. టీమిండియా మనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తనకు ఇలా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

'ఇలా వెళ్లి నన్ను నేను ఎక్స్‌ప్రెస్ చేసుకునే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో టీం మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్.. కెప్టెన్ హార్దిక్ అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా. వీళ్లంతా నాపై ఎంతో నమ్మకం ఉంచారు. అది నాపై చాలా ప్రభావం చూపుతుంది' అని చెప్పుకొచ్చాడు.

నాలుగో టీ20లో జైస్వాల్‌తోపాటు శుభ్‌మన్ గిల్ కూడా చెలరేగాడు. వీళ్లద్దరూ ఆకట్టుకోవడంతో.. భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండానే విజయం సాధించేలా కనిపించింది. 'నేను హోల్డర్, మెకాయ్‌తో కలిసి చాలా ఆడా. వాళ్లను ఎదుర్కోవడంలోనాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇక గిల్ కూడా చెలరేగాడు' అని తెలిపాడు. మెకాయ్, హోల్డర్ ఇద్దరూ జైస్వాల్‌తోపాటు రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన సంగత తి తిలాడ

Story first published: Sunday, August 13, 2023, 10:49 [IST]
Other articles published on Aug 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+