వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్, నిపుణులు కూడా చాలా చిరాకు పడుతున్నారు. ఈ క్రమంలో చేస్తున్న ప్రయోగాలను టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా సమర్ధించుకున్నాడు. ఇప్పుడు తప్పితే మళ్లీ ప్రయోగాలు చేసే ఛాన్స్ తమకు దక్కదని చెప్పాడు.
తొలి వన్డేలో భారత బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేసిన టీం మేేజ్‌మెంట్.. రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దర్నీ పక్కన పెట్టి కుర్రాళ్లను ఆడించింది. ఈ మ్యాచ్‌లో టీం ఓడిపోయింది. దీంతో చాలా మంది మేనేజ్‌మెంట్‌ను తిట్టిపోశారు. అయితే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌కు ముందు జట్టులో ప్రయోగాలు చేసే ఛాన్స్ ఇప్పుడే అని జడ్డూ అన్నాడు.

ఇలా రెండో వన్డే ఓడిపోవడంతో మూడో వన్డేలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా పడిపోయింది. ఈ వన్డే కోసం ట్రినిడాడ్ చేరుకున్న జడ్డూ.. 'ఆసియా కప్, వరల్డ్ కప్ ముందు ప్రయోగాలు చేయడం, కాంబినేషన్లు మార్చడం చేసే అవకాశం ఉన్న ఒకే ఒక సిరీస్ ఇది. మేం ఆ రెండు టోర్నీల్లో అన్ని ప్రయోగాలు చేయలేం కదా' అన్నాడు.
'ఇప్పుడు చేసే ప్రయోగాల వల్ల జట్టులో బ్యాలెన్స్ ఎలా ఉందో మాకు తెలుస్తుంది. జట్టు బలాలు, అవకాశం ఉన్న కాంబినేషన్లు తెలుస్తాయి' అని చెప్పాడు. రెండో వన్డేలో ఓడిపోయినందుకు బాధ పడుతున్నారా? అని అడిగితే.. 'అబ్బే.. అలాంటిదేం లేదు. మేం సమ్‌థింగ్ ట్రై చేస్తున్నాం. వేరే వేరే కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం' అని తెలిపాడు.
'ఒక కాంబినేషన్‌తో ముందుకు వెళ్లొచ్చా? అని చూసుకోవాలి. ఒక్క ఓటమి గురించి మేం వర్రీ అవడం లేదు.' అని స్పష్టం చేశాడు. ఇలా ప్రయోగాలు చేయడం వల్ల వరల్డ్ కప్ వంటి టోర్నీలో ఏ జట్టుతో ఆడాలో ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించగా.. దీనిపై టీం మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు ఆల్రెడీ ఒక అవగాహన ఉందని తేల్చిచెప్పాడు.