Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WIvsIND : కోహ్లీపై జోకులు వేసిన ఇషాన్ కిషన్.. ఎక్కడ నిలబడుతున్నావ్? అంటూ కామెడీ! (వీడియో)

విండీస్‌తో తొలి టెస్టులో భారత యువ స్టార్ ఇషాన్ కిషన్ కూడా అరంగేట్రం చేశాడు. ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా కనిపించిన అతను మంచి ఎనర్జీతో కనిపించాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ తన సహచర ఆటగాళ్లతో జోకులు పేలుస్తూ చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నాడు. ఇది అతని మొదటి టెస్టు అనే అనుమానమే ఎవరికీ రాదు. అంత ఎనర్జీతో కనిపించిన ఇషాన్.. కొన్ని సందర్భాల్లో రిషభ్ పంత్‌ను గుర్తుచేశాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీకర్ భరత్‌ను కాదని, కిషన్‌కు అవకాశం ఇవ్వడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న కిషన్.. రెండు సూపర్ క్యాచులు అందుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వచ్చిన క్యాచ్‌ కోసం చాలా వేగంగా రియాక్ట్ అయిన కిషన్.. ముందుకు డైవ్ చేసి మరీ చక్కని క్యాచ్ అందుకున్నాడు. దీంతో రేమన్ రీఫర్ (2) పెవిలియన్ చేరాడు.

Ishan Kishan made a good debut against West Indies

ఆ తర్వాత రవీంద్ర జడేజా వేసిన బంతిని కట్ చేయడానికి జోషువా డిసిల్వ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కిషన్ క్యాచ్ చేయబోయాడు. అయితే తొలి ప్రయత్నంలో విఫలమైన అతను.. తడబడినా చివరకు క్యాచ్ నేలపాలు కాకముందే అందుకున్నాడు. దీంతో జోషువా డి సిల్వ (2) కూడా మైదానం వీడాడు. ఈ రెండు క్యాచులు అందుకోవడంతోపాటు ఫీల్డ్‌లో ఉన్న సీనియర్లతో కిషన్ జోకులు పేల్చాడు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై అతను జోకులు వేశాడు. అతని కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. వీటిని విన్న ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. అశ్విన్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న కోహ్లీని అతను టీజ్ చేశాడు. 'విరాట్ భాయ్.. కొంచెం స్ట్రెయిట్‌గా.. ఆ.. అక్కడే నిలబడు' అని చెప్పాడు అక్కడితో ఆగకుండా కోహ్లీ నిలబడిన ప్లేస్‌పై జోక్ చేస్తూ.. 'ఎలాంటి ప్లేస్ వెతుక్కున్నావ్ భాయ్?' అంటూ ఎగతాళి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Story first published: Thursday, July 13, 2023, 16:05 [IST]
Other articles published on Jul 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+