For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma: సిరీస్ టీమిండియాదే.. కానీ అశ్విన్ కు నిరాశ.. ఆ అవార్డు ఇవ్వలేదే!

వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. తొలి టెస్టులో అధ్బుతంగా ఆడిన టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా ఈ టెస్టు డ్రా అయింది. దీంతో చాలామంది ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఐదో రోజు ఆటలో ఈ మ్యాచ్ ఫలితం వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు.

నాలుగో రోజు టీమిండియా జోరు చూసిన తర్వాత.. ఈ నమ్మకం మరింత పెరిగింది. కానీ చివరి రోజు కుంభవృష్టి వర్షం పడటంతో ఒక్క బంతి వెయ్యకుండానే ఆట ముగిసింది. అయితే తొలి టెస్టులో భారత్ దిగ్విజయం సాధించిన క్రమంలో సిరీస్ 2-1 తో భారత్ వశమైంది. ఈ అవార్డును రోహిత్ అందుకున్నాడు.

INDvsWI India bags test series but Ashwin got nothing

ఈ మ్యాచులో తాము కొంత పోరాటం చూపమని, అయితే కేవలం 20 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదని విండీస్ కెప్టెన్ అన్నాడు. తాము మరింత నిలకడగా రాణించేందుకు ట్రై చేస్తామని, ఆసీస్ తో సీరీస్ కు ముందు తమకు ఈ సిరీస్ చక్కగా ఉపయోగపడిందని, తమ లోపాలను తెలియచేసింది అని అన్నాడు.

ఇక రెండో టెస్టులో విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్ తో చెలరేగాడు. నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే విండీస్ ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 60 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకొని తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ కారణంగా అతనికి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది.

అయితే ఈ మ్యాచులో "ప్లేయర్ ఆఫ్ ది సిరీస్" ఎవరికీ ఇవ్వలేదు. రెండు మ్యాచుల్లో అతు బ్యాటుతో, ఇటు బంతితో రాణించిన రవిచంద్రన్ అశ్విన్ కు ఈ అవార్డు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎవరికీ ఈ అవార్డు ఇవ్వకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

Story first published: Tuesday, July 25, 2023, 10:59 [IST]
Other articles published on Jul 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+