Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: టీంలో సూర్య ఉండటం నా అదృష్టం: పాండ్యా

విండీస్‌తో మూడో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సరైన ఆరంభం దక్కకపోయినా భారత జట్టు చెలరేగింది. సూర్యకుమార్ యాదవ్ (83), తిలక్ వర్మ (49 నాటౌట్) అద్భుతంగా ఆడారు.

చివర్లో హార్దిక్ పాండ్యా (20 నాటౌట్) చివర్లో భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే టీమిండియా ఈ సిరీస్ కోల్పోయి ఉండేది. ఈ నేపథ్యంలో విజయం తమకు చాలా కీలకమైందని భారత సారధి హార్దిక్ పాండ్యా అన్నాడు.

INDvsWI Hardik Pandya says having Surya is his luck

'ఈ మ్యాచులు ఎంత ముఖ్యమని మేం మాట్లాడుకున్నాం. మా నిర్ణయాలపై నిలబడాల్సిన టైం ఇది. రెండు ఓటములు, రెండు విజయాలు వచ్చినంత మాత్రాన మారేదేం లేదు. మేం ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్లాన్స్ వేస్తున్నాం. ఇలాంటి సమయంలో మా క్యారక్టర్ చూపించడం చాలా ముఖ్యం' అని పాండ్యా చెప్పాడు.

'స్పిన్నర్ల విషయంలో ప్రత్యేకంగా ఏం ప్లాన్లు వేయలేదు. పూరన్ రాకపోవడంతో వారిని ఎక్కువ యూజ్ చేశాం. చివరి మ్యాచ్‌లో అక్షర్ బౌలింగ్ చేయలేదు. కానీ ఈ రోజు తను ఆడిన విధానం వల్ల నాకు కొంత అవకాశం దొరికింది. యుజీ, కుల్దీప్‌ను ఆ తర్వాత ఉపయోగించే ఛాన్స్ దక్కింది. ముఖేష్, అర్షదీప్ ఇద్దరూ చివర్లో రాణించారు' అన్నాడు.

'పూరన్ భారీ షాట్లు ఆడాలంటే.. నా బౌలింగ్‌లో కొట్టమనండి. ఇలాంటి కాంపిటీషన్ నాకు చాలా ఇష్టం. తనకు బౌలింగ్ చేసే సమయంలో నేను పొరపాట్లు చేయడం కుదరదని నాకు తెలుసు. నాలుగో మ్యాచులో అయినా నా మీద ఎటాక్ చేస్తాడని ఆశిస్తున్నా. మా టీంలో 8వ స్థానంలో బ్యాటర్లు లేరు. కానీ బౌలర్లు మ్యాచులు గెలిపిస్తారు' అని తెలిపాడు.

'బ్యాటర్లు పరుగులు చేస్తే.. 8వ స్థానంలో ఎవరూ ఆడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గేమ్ ఇంకా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. సూర్య-తిలక్ పార్టనర్‌షిప్ బ్రిలియంట్‌గా ఉంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. సూర్య వంటి ప్లేయర్ టీంలో ఉండటం నా అదృష్టం. తనకు ఛాలెంజ్‌లు అంటే చాలా ఇష్టం. తన వల్ల టీంలో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది' అని మెచ్చుకున్నాడు.

Story first published: Wednesday, August 9, 2023, 7:26 [IST]
Other articles published on Aug 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+