Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hardik Pandya: విండీస్ టూర్‌పై పాండ్యా అసహనం.. వసతులు బాగలేవంటూ ఆగ్రహం!

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ జరిగిన బ్రయాన్ లారా స్టేడియంలో అరేంజ్‌మెంట్స్‌పై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 200 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సంగతి తెలిసిందే.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీసును భారత జట్టు 2-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. కానీ పాండ్యా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో వసతులు ఎలా ఉన్నాయని విండీస్ మాజీ దిగ్గజం డారెన్ గంగ ప్రశ్నించగా.. పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ఈ స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

Hardik Pandya

'మేం వన్డేలు ఆడిన నైసెస్ట్ మైదానాల్లో ఇది ఒకటి. కానీ ఇక్కడకు రావడానికి ట్రావెల్ ప్లాన్స్, మిగతా వసతులు మాత్రం ఏమంత గొప్పగా లేవు. దీని గురించి విండీస్ క్రికెట్ బోర్డు పట్టించుకోవాలి' అని సూచించాడు. 'మేం మళ్లీ విండీస్‌కు వచ్చినప్పుడు పరిస్థితులు మరింత బాగుంటాయని ఆశిస్తున్నా. ట్రావెతింగ్ నుంచి చాలా విషయాలు మేనేజ్ చేయడం వరకు అన్నీ కొంత మెరుగవ్వాలి' అని చెప్పాడు.

'మేం మరీ లగ్జరీ వసతుల కోసం అడగడం లేదు. కానీ కనీసం బేసిక్ అవసరాలు తీరాలి కదా. గతేడాది కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కొంత దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. మళ్లీ ఏదైనా టీం ఇలా వచ్చినప్పుడు కనీస అవసరాలు తీర్చాలి. అది ఒక్కటి తప్ప.. ఇక్కడ ఆడటం, రిసీవ్ చేసుకున్న విధానం అంతా చాలా బాగుంది' అని హార్దిక్ తెలిపాడు.

ఇక మూడో మ్యాచ్ ఘనవిజయం సాధించడంపై కూడా సంతోషం వ్యక్తం చేశాడీ ఆల్‌రౌండర్. ఈ మ్యాచ్‌లో పాండ్యా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక్కడకు వచ్చినప్పుడు తాము ఒత్తిడిని తట్టుకొనే వస్తామని పాండ్యా అన్నాడు. అలాగే తమ టీం కూడా అద్భుతంగా ఆడారని మెచ్చుకున్నాడు. ఒక కెప్టెన్‌గా ఇలాంటి హై ప్రెజర్ మ్యాచ్‌లు తనకు బాగా ఇష్టమన్నాడు.

Story first published: Wednesday, August 2, 2023, 18:26 [IST]
Other articles published on Aug 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+