Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: రెండో టీ20లో పాండ్యా చేసిన రెండు కీలక తప్పులు ఇవే..!

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో పోరాడినా కూడా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో ఐదు టీ20ల సిరీసులో భారత జట్టు 0-2 తేడాతో వెనుక బడింది. ఈ మ్యాచ్‌లో భారత్ చేసిన తప్పిదాలు ఏంటంటే?

ఓవర్లు పూర్తిగా వేయనివ్వలా..:ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఛేజింగ్ ఆరంభమైన తర్వాత భారత్ గెలుపు కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ చాహల్ వేసిన ఒక్క ఓవర్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతని ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు.

INDvsWI Hardik Pandya made these two mistakes in this defeat

అలాగే మరో బ్యాటర రనౌట్ అయ్యాడు. అది అతని మూడో ఓవర్ మాత్రమే. దీంతో నాలుగో ఓవర్లో ఏం చేస్తాడని అంతా ఎదురు చూశారు. కానీ పాండ్యా మాత్రం చాహల్‌కు మళ్లీ బంతిని అందించలేదు.

తెలుగోడి సత్తా..:ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మను ఆడించడం టీమిండియా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్‌పై చూడచక్కని షాట్లతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

మిగతా బ్యాటర్లు అందరూ తడబడిన చోట తను మాత్రం రాణించి భారత్‌కు పోరాడే స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టీ20లో కూడా తిలక్ చక్కగా రాణించిన సంగతి తెలిసిందే.

INDvsWI Hardik Pandya made these two mistakes in this defeat

ఎందుకు తీసుకున్నారు?:ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చేసిన మరో పెద్ద తప్పు అక్షర్ పటేల్‌ను ఆడించడం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ కోసం అతన్ని తీసుకున్న పాండ్యా.. ఈ మ్యాచ్‌లో ఒక్కసారి కూడా అక్షర్‌కు బంతి ఇవ్వలేదు. తొలి టీ20లో చక్కని ఎకానమీతో బౌలింగ్ చేసిన అక్షర్ రాణించాడు.

అలాంటి వాడిని టీంలోకి తీసుకొని, ఒక్క ఓవర్ కూడా వేయించని కారణంగా ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. విండీస్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హుస్సేన్ రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. అలాంటి పిచ్‌పై అక్షర్ మరింత రాణించేవాడే. కానీ పాండ్యా మాత్రం తన చెత్త నిర్ణయంతో అతనికి బౌలింగ్ ఇవ్వలేదు.

Story first published: Monday, August 7, 2023, 12:26 [IST]
Other articles published on Aug 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+